ఎస్బీఐ ఏటీఎంలో రూ.2000 దొంగనోట్లు

22 Feb, 2017 15:46 IST|Sakshi
ఎస్బీఐ ఏటీఎంలో రూ.2000 దొంగనోట్లు

న్యూఢిల్లీ: నిత్యావసర ఖర్చులకోసం డబ్బు డ్రా చేసుకునేందుకు వెళ్లిన ఓ యువకుడు బిత్తరపోయాడు. రూ.8000ను విత్‌ డ్రా చేయగా మొత్తం రూ.2000 దొంగ నోట్లు రావడంతో అవాక్కయ్యాడు. వాస్తవానికి నోటు అచ్చం కొత్త రూ.2000 నోట్ల మాదిరిగానే ఉన్నప్పటికీ దానిపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అని ఉండాల్సిన చోట ‘చిల్డ్రన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా’  అనే పేరిట నోట్లు ముద్రించి ఉన్నాయి.

ఫిబ్రవరి 6న ఈ ఘటన ఢిల్లీలోని సంఘం విహార్‌లో గల ఎస్బీఐ ఏటీఎంనుంచి ఈ నోట్లు రావడంతో పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఒరిజినల్‌ నోటుపై ఎలాంటి అక్షరాలను ఉపయోగించారో అచ్చం అలాంటివే దొంగనోట్ల ముద్రణకు వాడారని, వాటర్‌ మార్క్‌ వద్ద చురాన్‌ పట్టి అని రాసి ఉందని, మిగితా అన్ని అంశాలు కూడా ఆర్బీఐ మాదిరిగానే ముద్రించారని ఆ వ్యక్తి తెలిపాడు. బ్యాంకు అధికారులను కూడా సంప్రదించి పోలీసులు దర్యాప్తు వేగం పెంచారు.

మరిన్ని వార్తలు