పాఠశాలలోకి చిరుతపులి.. భయంతో పరుగులు

27 Feb, 2020 15:20 IST|Sakshi

పిలిభిత్‌ : ప్రభుత్వ పాఠశాల ఆవరణలోకి ఒక చిరుతపులి ప్రవేశించి విద్యార్థులను భయబ్రాంతులకు గురి చేసిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని పిలిభిత్‌లో చోటుచేసుకుంది. పులిని చూసి హడలిపోయిన విద్యార్థులు తరగతి గదుల్లోకి పరుగులు తీశారు. అయితే చిరుతపులి పాఠశాల ఆవరణలో ఉన్న ఒక కుక్కపై దాడి చేసి దానిని పిలిభిత్‌ టైగర్‌ రిజర్వ్‌లోని బారాహీ అటవీ ప్రాంతంలోకి ఈడ్చుకుపోయింది.ఈ క్రమంలో పాఠశాల ప్రధనోపాధ్యాయురాలు రావడంతో విద్యార్థులు ఆమెకు జరిగిందంతా వివరించారు. దీంతో ఆమె ఈ విషయాన్ని అటవీ శాఖ అధికారులకు తెలపడంతో వారు వచ్చి పాఠశాలను సందర్శించి చిరుతపులి పాద ముద్రలు సేకరించారు. కాగా విద్యార్థుల భద్రతతో పాటు చిరుత కదలికలను గుర్తించేందుకు పాఠశాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీనియర్‌ పారెస్ట్‌ అధికారి అజ్మేర్‌ యాదవ్‌ తెలిపారు. అయితే చిరుతపులి ఒకట్రెండు రోజుల్లో తిరిగి అడవికి వెళ్లిపోతుందని అధికారులు భావిస్తున్నారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు