అవకాశాల్లేక కుంగిపోతున్నారు!

9 Nov, 2015 15:36 IST|Sakshi
అవకాశాల్లేక కుంగిపోతున్నారు!

పారిస్: అవకాశాల లేమితో కుంగిపోతున్న అట్టడుగు వర్గాల విద్యార్థుల జీవితాలను మార్చేసే శక్తి విద్యకు ఉందని 'సూపర్30' వ్యవస్థాపకులు ఆనంద్‌కుమార్ అన్నారు. గతేడాది ఐఐటీ జేఈఈలో ఉత్తీర్ణత సాధించిన ఆటోరిక్షా డ్రైవర్ కూతురు, సూపర్30 విద్యార్థిని 'నిధి ఝా' విజయగాథ ఆధారంగా ఫ్రెంచి భాషలో తెర కెక్కించిన 'ది బిగ్ డే' చిత్రాన్ని ప్రముఖ ఫ్రెంచి బిజినెస్ స్కూల్ 'ఎసెక్ స్కూల్' లో ప్రదర్శించిన అనంతరం ఆయన మాట్లాడారు.

అవకాశాల లేకపోవడం వల్లే అట్టడుగు వర్గాల విద్యార్థులు కుంగుబాటుకు గురవుతున్నారన్నారు. ఇతర విద్యార్థులతో సమానంగా వారికి సామర్థ్యాలు ఉన్నాయని, ఒక్క చిన్న అవకాశం వారి జీవితాలను మార్చేయగలదని తన 30 ఏళ్ల అనుభవంలో ఎన్నో ఉదాహరణలు చూశానని చెప్పారు. నిధి ఝా జీవితం ఆధారంగా ఫ్రెంచి దర్శకుడు పాస్కల్ ప్లిసన్ ది బిగ్ డే చిత్రాన్ని తెరకెక్కించారు. నిధి ఝా ప్రస్తుతం ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మైన్స్‌లో విద్యనభ్యసిస్తోంది.

మరిన్ని వార్తలు