చైనా దొంగబుద్ధి..!?

2 Dec, 2017 12:41 IST|Sakshi

చైనా,  పాకిస్తాన్‌లు భారత్‌ వెనుక గొయ్యి తీస్తున్నాయా? పాకిస్తాన్‌-చైనా ఎకనమిక్‌ కారిడార్‌ పేరుతో.. సైనిక సహకారం అందించుకుంటున్నాయా? ఇండో-పాక్‌ సరిహద్దులో బంకర్ల ఏర్పాటుకు చైనా సహకరిస్తోం‍దా? సరిహద్దుల వెంబడి పాకిస్తాన్‌ను చైనా అండగా ఉంటోందా? అంటే అవుననే సమాధానం వస్తోంది.

సాక్షి, న్యూఢిల్లీ : ఇండో-పసిఫిక్‌ రీజియన్‌లో అజేయ శక్తిగా ఎదుగుతున్నభారత్‌ను దొంగ దెబ్బ కొట్టేందుకు పాకిస్తాన్‌ను చైనా రెచ్చగొడుతున్నట్లు కనిపిస్తోందని ఒక అంతర్జాతీయ సర్వే ప్రకటించింది. దిమ్మతిరిగే వాస్తవాలను సర్వే వెలువరించింది. ఈ సర్వే ప్రకారం.. ఇండో-పాక్‌ సరిహద్దులో పాకిస్తాన్‌ సైన్యానికి అనుకూలంగా చైనా బంకర్లను ఏర్పాటు చేస్తోంది.  అంతేకాక జమ్మూ కశ్మీర్‌ నుంచి గుజరాత్‌కు వరకూ ఉన్న సరిహద్దు వెంబడి పాకిస్తాన్‌ బంకర్ల నిర్మాణం చేపడుతోందని తెలుస్తోంది. అంతేకాక సరిహద్దుల్లో అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రెండు ఎయిర్‌పోర్టుల నిర్మించగా.. మరో రెండు నిర్మాణ పనులు కొనసాగుతున్నట్లు సర్వేలో వెల్లడయింది.

సరిహద్దుల్లోనే!
రాజస్థాన్‌లోని జైలస్మీర్‌కు సరిహధ్దుకు కేవలం 25 కిలోమీటర్ల దూరంలోని ఖైరాపూర్‌ వద్ద చైనా సహకారంతో పాకిస్తాన్‌ ఎయిర్‌ పోర్టు నిర్మాణం పూర్తి చేసింది. ప్రస్తుతం​ఈ ఎయిర్‌ బేస్‌లో చైనాకు చెందిన రక్షణ శాఖ హెలికాప్టర్లు చక్కర్లు కొడుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఎయిర్‌పోర్టుకు రక్షణగా చైనా సైనికులు పహారా కాస్తున్నట్లు సర్వే ప్రకటించింది. అలాగే గుజరాత్‌ సరిహద్దుకు దగ్గర్లోని మిథి వద్ద పాకిస్తాన్‌ మరో ఎయిర్‌పోర్టు నిర్మాణాన్ని పూర్తి చేసింది. ఇదిలా ఉండగా ఈ ఎయిర్‌పోర్టుకు సమీపంలోనే చైనా-పాకిస్తాన్‌ ఎకనమిక్‌ కారిడార్‌ ప్రతిపాదిత రహదారి వెళుతోంది.

భారీగా బంకర్లు
చైనా సహకారంతో పాకిస్తాన్‌ సరిహద్దుల్లో ఇప్పటికే 350 బంకర్లను నిర్మించుకున్నట్లు సర్వే తెలుస్తోంది. అంతేకాక రక్షణ కోసం వినియోగించే సొరంగాలను ఏర్పాటు చేసుకుంది.

చైనా పరికరాలు
సరిహద్దుల్లో పాకిస్తాన్‌ నిర్మించిన ఎయిర్‌పోర్టుల్లో చైనాకు చెందిన ఆధునిక రాడార్‌ వ్యవస్థ, ఇతర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించారు.

నిఘా వర్గాలేమంటున్నాయి!
పాకిస్తాన్‌-చైనా మధ్య రక్షణ సహకారం పెరుగుతోందని భారత నిఘా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. కొన్నాళ్లుగా సరిహద్దుల్లో పాకిస్తాన్‌ భారీ నిర్మాణాలను చేపడుతున్న విషయం నిజమని నిఘా వర్గాలు స్పష్టం​ చేశాయి. చైనా చర్యలు ఉపఖండంలో పరిస్థితులను విషమంగా మార్చేలా ఉన్నాయని నిఘావర్గాలు తెలిపాయి.

మరిన్ని వార్తలు