చైనా కిట్లలో అత్యంత నాణ్యత ఉంది..

22 Apr, 2020 11:22 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ సోకిందో, లేదో వేగంగా నిర్ధారించే ‘రాపిడ్‌ టెస్టింగ్‌ కిట్స్‌’ అత్యంత నాణ్యత కలిగి ఉన్నాయని భారత్‌లోని చైనా రాయబార కార్యాలయం ప్రతినిధి జి రాన్ వెల్లడించారు. వైద్యానికి సంబంధించిన రాపిడ్‌ టెస్టింగ్‌ కిట్లను ఎగుమతి చేయడంలో నాసిరకం ఉత్పత్తులను చైనా ఎప్పుడూ ప్రోత్సహించదని ఆయన చెప్పారు. అదేవిధంగా చైనా నుంచి భారత ఉన్నతాధికారులకు ఎటువంటి అత్యవసర సాయమైన అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు. (వాటిని రెండ్రోజులు వాడొద్దు)

భారత్‌లో కరోనా వైరస్‌ రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో కరోనా టెస్టింగ్‌ కిట్లను చైనా నుంచి భారత్‌ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. కానీ చైనా నుంచి కొనుగోలు చేసిన ఆ కిట్స్‌ ద్వారా జరిపిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో సరైన ఫలితాలు రావడం లేదని పలు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) రెండు రోజుల పాటు ఆ కిట్లను వాడవద్దని మంగళవారం రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. ఇక చైనా నుంచి వచ్చిన ర్యాపిడ్‌ టెస్టింగ్‌ కిట్స్‌ వినియోగాన్ని నిలిపేస్తున్నట్లు రాజస్తాన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.   
 

>
మరిన్ని వార్తలు