‘ఆ 42 యాప్‌లను డిలీట్‌ చేయండి’

29 Nov, 2017 12:29 IST|Sakshi

న్యూఢిల్లీ : 42 ఆండ్రాయిడ్‌ యాప్‌ల ద్వారా చైనా భారత్‌పై గూఢచర్యం చేస్తోందని భారతీయ నిఘా సంస్ధ(ఐబీ) వెల్లడించింది. సైనికులందరూ ఆ యాప్‌లను తమ మొబైళ్ల నుంచి తొలగించాలని సూచించింది. భారత్‌కు చెందిన భద్రతా వ్యవస్థల విషయాలను ఈ యాప్‌ల ద్వారా చైనా తెలుసుకుంటున్నట్లు పేర్కొంది. రిపోర్టుల ప్రకారం.. వాస్తవాధీన రేఖ వద్ద కావలి ఉంటున్న సైనికులందరూ తమ మొబైళ్లను ఫార్మాట్‌ చేయాలని ఇంటిలిజెన్స్‌ డీఐజీ సూచనలు చేశారు.

వియ్‌ చాట్‌(WeChat), ట్రూ కాలర్(Truecaller)‌, వీబో(Weibo), యూసీ బ్రౌజర్(UC Browser)‌, యూసీ న్యూస్‌(UC News) లాంటి తదితర 42 యాప్‌లు భారత్‌కు అత్యంత ప్రమాదకరమని చెప్పారు. చైనా మొబైళ్లలో ఈ యాప్‌లను వినియోగించడం అత్యంత ప్రమాదకరమని తెలిపారు. దేశ రక్షణకు సంబంధించిన సమాచారం తస్కరణకు గురయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.

>
మరిన్ని వార్తలు