సుష్మా మళ్లీ స్పందించారు...

16 Aug, 2017 18:23 IST|Sakshi
సుష్మా మళ్లీ స్పందించారు...

న్యూఢిల్లీ: తన మంత్రిత్వ శాఖకు సంబంధించిన అంశాలపై వేగంగా స్పందించే సుష్మా స్వరాజ్‌ మరోసారి చొరవ తీసుకున్నారు. షాంగై పుడోంగ్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో చైనా ఎయిర్‌లైన్‌ సంస్థ భారతీయుల పట్ల అమర్యాదరంగా వ్యవహరించిందని వచ్చిన ఆరోపణలపై చైనాకు భారత్‌ ఫిర్యాదు చేసింది. భారత ప్రయాణీకుడి ఆరోపణల నేపథ్యంలో విదేశాంగ శాఖ ఈ మేరకు స్పందించింది.

చహల్‌ అనే భారత ప్రయాణీకుడు ఈనెల 6న న్యూఢిల్లీనుంచి  శాన్‌ఫ్రాన్సిస్కో వెళుతూ షాంగై పుడోంగ్‌ ఎయిర్‌పోర్ట్‌లో ఆగి తదుపరి విమానం కోసం వేచిచూశారు. ఇదే విషయమై సంబంధిత అధికారితో మాట్లాడగా ఆయన తనపై కేకలు వేస్తూ అమర్యాదకరంగా వ్యవహరించారని చహల్‌ ఆరోపించారు. చైనా అధికారి వ్యవహార శైలి చూస్తే భారత్‌-చైనా మధ్య సరిహద్దు ఉద్రిక్తతలతో ఆయన ప్రభావితమైనట్టుగా ఉందన్నారు. తనకు ఎదురైన అనుభవాలను వివరిస్తూ ఆయన   విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్‌కు లేఖ రాశారు. మం‍త్రి చొరవతో ఈ అంశాన్ని చైనా విదేశాంగ శాఖ, పుడోంగ్‌ ఎయిర్‌పోర్ట్‌ అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్టు భారత అధికారులు తెలిపారు.అయితే ఈ ఆరోపణలను చైనా ఈస్ర్టన్‌ ఎయిర్‌లైన్స్‌ తోసిపుచ్చింది. సంబంధింత మెటీరియల్స్‌, ఎయిర్‌పోర్ట్‌ సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించిన మీదట ఈ ఆరోపణలు నిరాధారమని తేలినట్టు ఆ సంస్థ పేర్కొంది.

మరిన్ని వార్తలు