ప్లేస్టోర్‌ నుంచి టిక్‌టాక్‌ తొలగింపు

30 Jun, 2020 09:51 IST|Sakshi

న్యూఢిల్లీ : చైనా యాప్‌ టిక్‌టాక్‌ను గూగుల్‌ ప్లేస్టోర్, యాపిల్‌ యాప్‌ స్టోర్‌‌ నుంచి తొలగించాయి. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గూగుల్‌, యాపిల్‌ మంగళవారం ఈ నిర్ణయం తీసుకున్నాయి. టిక్‌టాక్‌, హెలో, షేర్‌ ఇట్‌తో సహా 59 చైనీస్‌ యాప్స్‌ను నిషేధిస్తూ చైనాకు భారత్‌ షాకిచ్చింది. దేశ సార్వభౌమాధికారం, సమగ్రత, రక్షణ, ప్రజాభద్రత దృష్ట్యా ఈ యాప్‌లపై నిషేధం విధిస్తున్నట్టు కేంద్ర సర్కారు సోమవారం ప్రకటించిన విషయం తెలిసిందే. భారత్‌–చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. గ్లోబల్‌ వెబ్‌ ఇండెక్స్‌ లెక్కల ప్రకారం గతేడాది జూన్ నాటికి భారతదేశంలో 12  కోట్ల మంది నెలవారీ టిక్‌టాక్ వినియోగదారులు ఉన్నారు. తమ యాప్‌ను నిషేధించిన నేపథ్యంలో ఈరోజు తమ వివరణ వినడానికి ప్రభుత్వం అంగీకరించిందని టిక్‌టాక్‌ ఇండియా తెలిపింది. (చైనాకు షాక్‌; టిక్‌టాక్‌పై నిషేధం)

మరిన్ని వార్తలు