చెన్నైకి చేరుకున్న జిన్‌పింగ్‌

11 Oct, 2019 14:16 IST|Sakshi

చెన్నై : చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ కొద్దిసేపటి క్రితం చెన్నై అంతర్జాతీయ విమానశ్రయానికి చేరుకున్నారు. ఎయిర్‌పోర్టులో ఆయనకు తమిళనాడు గవర్నర్‌ బన్వరిలాల్‌ పురోహిత్‌, సీఎం పళనిస్వామిలు ఘన స్వాగతం పలికారు. ఎయిర్‌పోర్ట్‌లో ఏర్పాటు చూసిన పలు సాంస్కృతిక ప్రదర్శనలను ఆసక్తిగా తిలకిస్తూ జిన్‌పింగ్‌ ముందుకు సాగారు. జిన్‌పింగ్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి నేరుగా ఐటీసీ చోళ హోటల్‌కు వెళ్లనున్నారు. అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకున్న అనంతరం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఆయన మహాబలిపురం బయలుదేరుతారు. నేడు, రేపు రెండు రోజులపాటు చెన్నై సమీపంలోని మహాబలిపురం వేదికగా ఆయన ప్రధాని నరేంద్ర మోదీ చర్చలు జరపనున్నారు. ఇది మోదీ, జిన్‌పింగ్‌ల మధ్య జరుగుతున్న రెండో అనధికారిక సమావేశం. 


ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ మహాబలిపురం చేరుకున్నారు. పలు ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై ఇరువురు నేతలు తమ ఆలోచనలు పంచుకునేందు ఈ సమావేశాలు వీలు కల్పిస్తాయని భారత విదేశాంగ శాఖ తెలిపింది. జిన్‌పింగ్‌ పర్యటన నేపథ్యంలో ప్రభుత్వం భారీగా భద్రత ఏర్పాట్లు చేసింది. 

మరిన్ని వార్తలు