-

అప్పుడు జల్సాలు.. ఇప్పుడు కన్నీళ్లు

25 Jun, 2019 20:23 IST|Sakshi

న్యూఢిల్లీ: బీహార్‌లో పెద్ద సంఖ్యలో చిన్నపిల్లలు మరణించడం తనను తీవ్రంగా కలచివేసిందంటూ ఆ రాష్ట్ర ఎంపీ, ఎల్‌పీజీ అధినేత రాంవిలాస్‌ పాశ్వాన్‌ కుమారుడు చిరాగ్‌ పాశ్వాన్‌ ఆవేదన చెందారు. మంగళవారం పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే  కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా  భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నారు.  మనం చేసే ప్రతీ తప్పుకు ప్రకృతి బదులిచ్చి తీరుతుందని  ప్రభుత్వ వైఫల్యాన్ని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. చనిపోయిన వారిపట్ల తన సానుభూతిని వ్యక్తపరుస్తూ ఇక నుంచి ఇలాంటి సంఘటనలు జరుగకుండా గట్టి చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. 

అయితే ఈ సంఘటన జరిగినప్పుడు చిరాగ్‌ పాశ్వాన్‌ గోవాలో తన బాలీవుడ్‌ స్నేహితులతో పార్టీ చేసుకుంటున్నారు. ఆ ఫోటోలు మీడియాలో వైరల్‌గా మారాయి. అప్పుడు విందులో మునిగితేలి,  ఇప్పుడు మాట్లాడడం వల్ల ఏం ప్రయోజనం ఉంటుందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.  చిరాగ్‌ తండ్రి రాంవిలాస్‌ పాశ్వాన్‌ ప్రస్తుత మోదీ క్యాబినెట్‌లో వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ శాఖలకు మంత్రిగా ఉన్నారు. కాగా, చిరాగ్‌ పాశ్వాన్‌ 2011లో ఓ బాలీవుడ్‌ సినిమాలో నటించగా, అది బాక్సాఫీస్‌ వద్ద బోల్తా పడింది. ఆ తర్వాత ఆయన సినిమాలను వదిలేసి రాజకీయాల్లో చేరారు. 

మరిన్ని వార్తలు