కరోనాతో సీఐఎస్‌ఎఫ్ అధికారి మృతి

12 May, 2020 16:20 IST|Sakshi

కోల్‌కతా : భారత్‌లో కరోనా వైరస్ కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. దేశాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి భద్రత బలగాలను కూడా వీడటం లేదు. కేంద్ర పారామిలటరీ బలగాలకు చెందిన సీఐఎస్ఎఫ్‌తోపాటు బీఎస్ఎఫ్, ఐటీబీపీ, సీఆర్పీఎఫ్ జవాన్లకు కరోనా సోకడం ఆందోళన కలిగిస్తుంది. తాజాగా కరోనా బారిన పడి సీఐఎస్ఎఫ్ అధికారి ఒకరు ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే.. కోల్‌కతాలో విధులు నిర్వర్తిస్తున్న అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ జారు బర్మన్‌కు కరోనా సోకింది. అయితే కరోనా చికిత్స తీసుకుంటున్న క్రమంలో సోమవారం ఆయన మృతిచెందినట్టు సీఐఎస్‌ఎఫ్‌ సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. (చదవండి : ‘సార్స్‌’లాగా ‘కరోనా’ కూడా అదృశ్యం...?)

కొద్ది రోజుల ముందు బర్మన్ స్థానిక ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నట్టగా తెలిసింది. దీంతో అధికారులు బర్మన్‌.. ప్రైమరీ కాంటాక్టులను గుర్తించే పనిలో పడ్డారు. ఇంతకుముందు కోల్‌కతాలోని ఇండియన్ మ్యూజియమ్ వద్ద విధులు నిర్వర్తిస్తున్న ఓ సీఐఎస్ఎఫ్ ఏఎస్ఐ, ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద విధులు నిర్వర్తిస్తున్న హెడ్ కానిస్టేబుల్ ర్యాంక్ అధికారి కూడా కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. కాగా, ఇప్పటివరకు పారామిలటరీ బలగాల్లో పనిచేస్తున్న 758 మందికి కరోనా పాజిటివ్‌గా తేలగా.. ఆరుగురు మృతిచెందినట్టుగా గణంకాలు చెబుతున్నాయి. (చదవండి : లాక్‌డౌన్‌ : 55 రోజుల పాటు ఎయిర్‌పోర్ట్‌లోనే)

మరిన్ని వార్తలు