సివిల్స్‌లో.. దుమ్మురేపారు

10 May, 2016 21:03 IST|Sakshi
సివిల్స్ టాపర్ టీనా దాబి

ఢిల్లీ: అఖిల భారత సివిల్ సర్వీసెస్-2015 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) మంగళవారం విడుదల చేసిన తుది ఫలితాల్లో ఢిల్లీకు చెందిన టీనా దాబి తొలి ర్యాంక్ సాధించగా, జమ్మూకు చెందిన అమీర్ రెండో ర్యాంక్ సాధించాడు. సివిల్స్ ర్యాంకుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు. విశాఖకు చెందిన చేకూరి కీర్తి 14 వర్యాంక్, హైదరాబాద్కు చెందిన జొన్నలగడ్డ స్నేహజ 103వ ర్యాంక్ సాధించారు.

 

(ర్యాంకర్ల పూర్తి జాబితా కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మొత్తం సివిల్స్‌లో 1078 మంది ఈసారి ఉత్తీర్ణులయ్యారు
వాళ్లలో జనరల్ 499, ఓబీసీ 314, ఎస్సీ 176, ఎస్టీ 89 మంది ఉన్నారు
ఐఏఎస్‌కు 180 మంది, ఐఎఫ్ఎస్‌కు 45 మంది, ఐపీఎస్‌కు 150మంది, కేంద్ర గ్రూప్‌ ఎ సర్వీసులకు 728 మంది, కేంద్ర గ్రూప్ బి సర్వీసులకు 61 మంది ఎంపికయ్యారు.

 

ర్యాంకుల వివరాలు:
ఫస్ట్ ర్యాంక్ - టీనా దాబి (ఢిల్లీ)
సెకండ్ ర్యాంక్ - అమీర్ (జమ్మూ)
చేకూరి కీర్తి  14 (విశాఖపట్నం)
వల్లూరు క్రాంతి 65  
సీహెచ్ రామకృష్ణ 84
విద్యాసాగర్ నాయుడు 101
జొన్నలగడ్డ స్నేహజ 103  (హైదరాబాద్)
పోతరాజు సాయి చైతన్య  158
నివేదిత నాయుడు 159
వై.రిషాంత్ రెడ్డి 180
పసుమర్తి వీజీ సతీష్ 191
సలిజామల వెంకటేశ్వర్ 216
ప్రవల్లిక 232
ఉదయ్ కుమార్ 234

>
మరిన్ని వార్తలు