బీజేపీ, టీఎంసీ కార్యకర్తల ఘర్షణ

17 Apr, 2016 19:16 IST|Sakshi
కోల్ కత్తా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆదివారం రెండో విడత పోలింగ్ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), బీజేపీ కార్యకర్తలు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణలో 8మంది గాయపడ్డారు.
 
ఈ సంఘటన బిర్భూమ్ జిల్లా దమ్ రుత్ గ్రామంలో చోటుచేసుకుంది. పోలింగ్ జరుగుతున్న సమయంలో ఘర్షణ జరిగిందని, ఇరు వర్గాలకు చెందిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. దాడులకు గురైంది తమ పార్టీ సభ్యులేనని బీజేపీ పేర్కొంది. పోలింగ్ బూత్ లో ఉన్న తమ పార్టీ సభ్యునిపై తృణమూల్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డాడని బీజేపీ ఆరోపించింది. ఉత్తర బెంగాల్ లోని ఆరు జిల్లాల్లో ఈ రోజు పోలింగ్ జరిగింది. కొన్ని చోట్ల ఏవీయంలు మొరాయించగా, సిబ్బంది సరిచేశారు.
 
>
మరిన్ని వార్తలు