టెన్త్‌ ఎగ్జామ్స్‌.. గోడలెక్కి మరీ..

5 Mar, 2020 08:37 IST|Sakshi
కాపీలు అందిస్తున్న యువకులు

ముంబై : పరీక్షలు రాస్తున్న టెన్త్‌ క్లాస్‌ విద్యార్థులకు చీటీలు అందించడానికి అత్యుత్సాహం చూపించారు కొందరు యువకులు. పరీక్ష హాలు దగ్గరి ప్రహారీ గోడ ఎక్కి మరీ పరీక్ష రాస్తున్న తమ వారికి సహాయం చేశారు. ఈ సంఘటన మహారాష్ట్రలోని యావాత్‌ మాల్‌ జిల్లాలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..  యావాత్‌మాల్‌ జిల్లాలోని ‘మహాగావ్‌ జిల్లా పరిషత్‌ స్కూల్‌’లో పదవ తరగతి పరీక్షలు రాస్తున్న తమ వారికి చీటీలు అందించడానికి కొందరు యువకులు ఎగబడ్డారు. హాలు దగ్గర ఉన్న ఎత్తైన అడ్డుగోడని ఎక్కి మరీ కాపీ కొట్టడానికి చీటీలు అందించారు. ఒకరికొకరు సహాయం చేసుకుంటూ.. కిటికీల దగ్గర చేరి చీటీలు అందించారు.

2015లో బిహార్‌లోని ఓ పరీక్ష సెంటర్‌ వద్ద కాపీలు అందిస్తున్న జనం

అంత జరుగుతున్నా ఇన్విజిలేటర్లు, అక్కడి అధికారులు పట్టించుకోకపోవటం గమనార్హం​. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. కాగా, 2015లోనూ ఇలాంటి ఘటన ఒకటి చోటుచేసుకుంది. బిహార్‌లోని వైశాలిలో టెన్త్‌ ఎగ్జామ్స్‌ రాస్తున్న తమ పిల్లలకు.. 6 అంతస్తుల భవనాన్ని తాళ్లతో ఎక్కి మరీ చీటీలు అందించారు కొందరు. ఆ సంవత్సరం బిహార్‌ వ్యాప్తంగా కాపీ చేయటానికి సహకరిస్తున్న 1000 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మరిన్ని వార్తలు