చిన్నతప్పుతోనే పంచకుల రణరంగం

26 Aug, 2017 20:21 IST|Sakshi
చిన్నతప్పుతోనే పంచకుల రణరంగం
ఛండీగఢ్‌: కేంద్ర బలగాలతో ముందస్తు మోహరింపులు, ఇంటర్నెట్‌ సేవల నిలిపివేత, చెక్‌ పోస్టుల ఏర్పాటు... ఇవేవీ పంచకులను రణరంగంగా మార్చకుండా ఆపలేకపోయాయి. తీర్పు నేపథ్యంలో జారీ చేసిన నిషేధాజ్నల ఉత్తర్వుల్లోని ఓ  చిన్న తప్పిదమే 31 ప్రాణాలు పోయేందుకు కారణమైందన్న వాదన వినిపిస్తోంది.
 
గుర్మీత్ రామ్‌ రహీమ్‌ సింగ్‌ పై అత్యాచార కేసులో ఈ నెల 25న తీర్పు సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతాయని భావించిన హరియాణా ప్రభుత్వం ముందస్తుగా ఓ ఆర్డర్‌ను ఆగష్టు 18న, తిరిగి 22న మరో ఆర్డర్‌ను జారీ చేసింది. వాటిలో పంచకులకు వచ్చే ప్రజలు ఎలాంటి ఆయుధాలు తీసుకురావటానికి వీల్లేందంటూ పేర్కొంది. అయితే జనాలు గుంపులుగా గుమిగూడొద్దనే వ్యాఖ్యను మాత్రం చేర్చలేదు. ఇదే కొంప ముంచిదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
 
ఇక ఈ ఆర్డర్లలో పొరపాటు ఉందంటూ 24వ తేదీ అంటే తీర్పు వెలువరించడానికి సరిగ్గా ఒక్కరోజు ముందు అడ్వొకేట్ జనరల్‌ బీఆర్‌ మహాజన్‌ బీఆర్‌ మహాజన్‌ కోర్టుకు కోరి "ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమిగూడకుండా ఉండటం" అన్న పదంను చేర్పించి కొత్త ఆర్డర్‌ను తీసుకొచ్చారు.  అయితే అప్పటికే సుమారు 2,00,000 మంది అనుచరులు పంచకులకు చేరుకోవటం, వారిని ఖాళీ చేయించే యత్నంలో బలగాలు విఫలమవ్వటం, ఆపై తీర్పు వెలువడటం, ఆగ్రహంతో రెచ్చిపోయిన డేరా అనుచరులు ప్రభుత్వ ఆస్తులను విధ్వంసం చేయటం, మరీ ముఖ్యంగా అల్లర్లలో ప్రాణాలు బలికావటం ఒకదాని వెంట ఒకటి జరిగిపోయాయి.

 

మరిన్ని వార్తలు