'కరెంటు స్తంభం ఎక్కి దూకి చావు.. నాకేంటి?'

7 Mar, 2016 13:26 IST|Sakshi
'కరెంటు స్తంభం ఎక్కి దూకి చావు.. నాకేంటి?'

చెన్నై: పేదరికం అనుభవించే వాడికి శాపం అనుకుంటే చూసేవాళ్లకు.. చిరాకు.. అసహ్యంగా అనిపిస్తుంటుంది. తమిళనాడులో జరిగిన ఓ ఘటన అది నిజమేనేమో అనే భావనను కలిగిస్తుంది కూడా. రవీంద్రన్ (48) అనే వ్యక్తి ఓ శరణార్థి. శ్రీలంక నుంచి వచ్చి మధురైలో శరణార్థుల నివాసంలో ఉంటున్నాడు. అతడి కుమారుడు ఆరోగ్యం బాలేక ఆస్పత్రి పాలయ్యాడు.

అదే సమయంలో వారికి ఆహారం ఏర్పాట్లు చూసేందుకు వచ్చిన రెవెన్యూ అధికారిని తన కుమారుడికి గైర్హాజరు వేయొద్దని, అలా చేస్తే భోజనం దొరకదని బ్రతిమిలాడుకున్నాడు. తన కొడుకు నిజంగానే ఆస్పత్రిలో ఉన్నాడని రశీదు కూడా చూపించాడు. అయినా కనికరించని ఆ అధికారి గైర్హాజరైనట్లుగానే మార్క్ చేశాడు.

దీంతో ఆయనను మరోసారి బ్రతిమిలాడుకునే క్రమంలో వెళ్లి ఆ కరెంటు స్తంభం ఎక్కి దూకి చావు అన్నాడు. ఆ మాట అనగానే నిజంగానే వెళ్లి హై టెన్షన్ విద్యుత్ వైర్ల స్థంభాన్ని ఎక్కి ఆ వైర్లు పట్టుకొని సెకన్లలో చనిపోయాడు. ఈ ఘటన జరిగిన వెంటనే ఆ అధికారిని చుట్టుపక్కల వారు చుట్టుముట్టారు. దీంతో పోలీసులు వచ్చి అతడికి రక్షణ కల్పించగా చర్యలు తీసుకోవాల్సిందేనని వారు నిలదీశారు.

మరిన్ని వార్తలు