త్రుటిలో తప్పిన ప్రమాదం

9 Aug, 2017 17:11 IST|Sakshi
త్రుటిలో తప్పిన ప్రమాదం

ఢిల్లీ :
దేశ రాజధానిలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మంగళవారం రెండు విమానాలకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఇథియోఫియన్‌ ఎయిర్లైన్స్‌, ఎయిర్‌ ఇండియాకు చెందిన విమానాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో విమానాల రెక్కలు ఒకదానికొకటి తగిలాయి. ఈ ప్రమాదంలో ఎయిర్‌ ఇండియా విమానం ఎడమవైపు రెక్క కొద్దిగా వంగిపోయింది. ఈ ఘటనపై డీజీసీఏ(డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌) విచారణకు ఆదేశించింది.

కాగా, ఇలాంటి సంఘటనే ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో గత ఏప్రిల్‌లో జరిగింది. ఢిల్లీ నుంచి గోవా వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం (ఏఐ156), రాంచీ నుంచి ఢిల్లీ వచ్చిన ఇండిగో (6ఈ389) విమానాలు దాదాపు ఢీకొనబోయాయి. ఏటీసీ (ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌) సిబ్బంది అప్రమత్తంగా ఉండటంతోపాటు పైలట్లు నైపుణ్యాన్ని ప్రదర్శించి భారీ ప్రమాదాన్ని నివారించగలిగారు.

>
మరిన్ని వార్తలు