కరోనా ఎఫెక్ట్‌: యూపీ సీఎం కీలక నిర్ణయం

21 Mar, 2020 14:03 IST|Sakshi

దేశంలో కరోనా వైరస్‌ కేసులు రోజురోజుకు పెరుగుతున్న వేళ కరోనా ప్రభావం నుంచి ప్రజలను కాపాడేందుకు యూపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. పేదలు, రోజువారి కూలీలపై ప్రభావం పడకుండా ఉండేందుకు వారికి సాయం ప్రకటించింది. దాదాపు 35 లక్షల మంది రోజువారి కూలీలకు నిత్యావసరాల కోసం రూ. 1000 ఇవ్వనున్నట్టు వెల్లడించారు. చాలా మంది ప్రజలను ఇళ్లకే పరిమితం కావాలంటూ ప్రభుత్వాలు ఆదేశిస్తున్న సమయంలో ఈ నిర్ణయం పేదలకు ఎటువంటి ఇబ్బంది కాకూడదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ తెలిపారు. 

కాగా యోగి నిర్ణయం వల్ల 15లక్షల మంది రోజువారి కూలీలు, 20.37 లక్షల మంది భవన నిర్మాణ రంగ కార్మికులు లబ్ధి పొందనున్నారు. కాగా ఇప్పటికే ఉత్తరప్రదేశ్‌లో 23 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీరిలో 9 మంది కోలుకోగా.. మిగిలిన వారు చికిత్స పొందుతున్నారు. రోజురోజుకు వైరస్‌ వ్యాప్తి అధికమవుతుండడంతో దీనికి అడ్డుకట్టవేసేందుకు ప్రజలను ఇళ్లలోనే ఉండాలని ప్రభుత్వం సూచిస్తోంది. అత్యవసరమైతేనే బయటకు రావాలని ప్రభుత్వం సూచిస్తోంది. ప్రభుత్వ నిర్ణయాలతో దినసరి కూలీల పరిస్థితి దారుణంగా తయారైంది. ఈ తరుణంలో పేదలకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదని యూపీ సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు.  చదవండి: కరోనా ఎఫెక్ట్‌: ఓలా క్యాబ్స్‌ కీలక నిర్ణయం 

అయితే తాజాగా ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం కరోనా నివారణ చర్యల్లో భాగంగా పాఠశాలల మూసివేతను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్‌ 2వ తేదీ వరకు పాఠశాలలను మూసివేయనున్నట్టు యూపీ ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఎటువంటి పరీక్షలు రాయకుండానే పై తరగతులకు ప్రమోట్‌ అయ్యే అవకాశం కల్పించింది. ఈ మేరకు అడిషనల్‌ చీప్‌ సెక్రటరీ రేణుక కుమార్‌ మంగళవారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు. చదవండి: ‘దగ్గు, గొంతు నొప్పి.. ఆ తర్వాత కరోనా’ 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా