'నేను చేసిన తప్పే ఆమె చేశారు'

13 Jul, 2016 09:06 IST|Sakshi
'నేను చేసిన తప్పే ఆమె చేశారు'

శ్రీనగర్: కశ్మీర్ లోయలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 2010లో తాను చేసిన తప్పునే ప్రస్తుత ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తి మళ్లీ చేశారని అభిప్రాయపడ్డారు. హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వనీ హతం తర్వాత తలెత్తె పరిస్థితులను అంచనా వేయడంలో ఆమె విఫలమయ్యారని విమర్శించారు.

"నేను చేసినట్టుగానే ముఫ్తి తప్పు చేశారు. బూటకపు ఎన్కౌంటర్లో మఖీల్ హతమైన తర్వాత 2010లో చోటుచేసుకున్న అల్లర్లను అదుపులో చేయడంలో నేను విఫలమయ్యాను. అల్లర్లు మొదలైన తర్వాత మొదటి 24-48 గంటలు చాలా కీలకం. ఈ సమయంలో చురుగ్గా వ్యవహరించకుంటే పరిస్థితులు చేయి దాటిపోయే ప్రమాదం ఉంది. ఇప్పుడు అదే జరిగింది. హింసాత్మక ఘటనలను అదుపు చేయడంలో ముఫ్తి విఫలమయ్యారు. 2010లో జరిగిన అల్లర్లలో 116 మంది మృతి చెందారు. అప్పుడు సీఎంగా ఉన్న నన్ను రాజీనామా చేయాలని ముఫ్తి డిమాండ్ చేశారు. కానీ నేను రాజీనామా చేయలేదు. 2014లో మేము ఓడిపోవడానికి ఈ ఘటన కూడా ఒక కారణం. ప్రస్తుత పరిస్థితులను ఎదుర్కొవడం ముఫ్తికి కొంచెం కష్టమే'నని ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు