డాన్సింగ్‌ వీడియో : సీఎంకు చేదు అనుభవం

2 Jun, 2018 12:03 IST|Sakshi
మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌, సంజీవ్‌ శ్రీవాస్తవ

భోపాల్‌ : గత రెండురోజులుగా సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తూ.. సామాన్యులతో పాటు సెలబ్రిటీలను కూడా ఆకర్షించిన డాన్సింగ్‌ అంకుల్‌ ఎవరో తెలిసిపోయింది. అయన పేరు సంజీవ్‌ శ్రీవాస్తవ. గోవిందా వీరాభిమాని అయిన  సంజీవ్‌ మధ్యప్రదేశ్‌లోని విదిశకు చెందినవారు. మధ్యప్రదేశ్‌లోని బాబా యూనివర్సిటీలో ఎలక్ట్రానిక్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న సంజీవ్‌కు.. వాళ్ల అమ్మ నుంచి ఈ నృత్యకళ అబ్బిందని తెలిపారు. ‘నా డాన్సింగ్‌ వీడియో ఇంతలా వైరల్‌ అవుతుందని అనుకోలేదు. చాలా సంతోషంగా ఉంది. నన్ను సపోర్టు చేసిన వాళ్లందరికీ ధన‍్యవాదాలు అంటూ’ సంజీవ్‌ వ్యాఖ్యానించారు.

అయితే ఓవర్‌నైట్‌ స్టార్‌గా మారిన ఈ డాన్సింగ్‌ అంకుల్‌ పెర్ఫామెన్స్‌కు ఫిదా అయిన మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ సంజీవ్‌ను పొగడుతూ చేసిన ట్వీట్‌ ఆయన్ని ఇబ్బందుల్లోకి నెట్టింది. ‘మా విదిశలోని భోపాల్‌లో పనిచేసే ప్రొఫెసర్‌ సంజీవ్‌ శ్రీవాస్తవ డాన్స్‌ భారత్‌ మొత్తానికి వినోదం పంచుతోంది. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా సరే.. మధ్యప్రదేశ్‌ నీళ్లలోనే ఏదో మహత్తు, ప్రత్యేకత ఉన్నాయి’అంటూ శివరాజ్‌ సింగ్‌ ట్వీట్‌ చేశారు.

ఆయన ట్వీట్‌కు స్పందనగా.. ‘ మధ్యప్రదేశ్‌ నీళ్లల్లో ప్రత్యేకత ఉన్నప్పటికీ పాపం ఎందుకనో అన్నదాతల కష్టాలు తీరడం లేదు. మరి వారి కష్టాలకు కారణం ఎవరో అంటూ’ ఓ నెటిజన్‌ ట్వీట్‌ చేయగా.. ‘ మధ్యప్రదేశ్‌లో అందరూ, అన్నీ ప్రత్యేకమైనవే.. ఒక్క మీరు తప్ప.. మీ శ్రద్ధ కాస్త రైతుల మీదకి కూడా మళ్లిస్తే మంచిది’ అంటూ మరొకరు వ్యంగంగా ట్వీట్‌ చేశారు. అంతేకాకుండా రైతుల పట్ల మధ్యప్రదేశ్‌ ప్రభుత్వ వైఖరి, వ్యాపమ్‌ కుంభకోణం గురించి ప్రస్తావిస్తూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు