మద్యం సీసాలో బొద్దింక గుడ్లు

20 Aug, 2015 15:55 IST|Sakshi
మద్యం సీసాలో బొద్దింక గుడ్లు

కొయంబత్తూర్: తాను కొన్న మద్యం బాటిల్ లో బొద్దింక గుడ్లు ఉన్నట్లు ఓ వినియోగదారుడు గుర్తించాడు. ఈ ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తమిళనాడులోని కొయంబత్తూరు పోలీసులు తెలిపారు. మద్యం సేవించడానికి ఓ దినసరి కార్మికుడు బుధవారం రాత్రి కొవైపూడురులో మందు కొన్నాడు. అనంతరం అతడు కొన్న మద్యం సీసాలో బొద్దింక గుడ్లు ఉన్నట్లు గుర్తించాడు. ఈ విషయమై షాపు వద్దకు వెళ్లి విషయం చెప్పాడు. ఆ బాటిల్ తమకు తిరిగి ఇవ్వాలని.. కస్టమర్ కు వేరే బాటిల్ ఇస్తామని అక్కడి పనివాళ్లు అతనికి ఆఫర్ చేశారు.

అందుకు ఆ కస్టమర్ నిరాకరించడంతో పాటు పోలీస్ స్టేషన్కు వెళ్లి జరిగిన విషయాన్ని ఫిర్యాదు చేశాడు. ప్రభుత్వ కార్యాలయ అధికారులకు బొద్దింక గుడ్లు ఉన్న బాటిల్ అందజేసి, ఈ ఘటనపై విచారణ జరిపించాలని తమను కోరినట్లు పోలీసులు వివరించారు. ప్రభుత్వం నడుపుతున్న టస్మాక్ ఔట్ లెట్లో తాను ఆ బాటిల్ కొన్నట్లు తన ఫిర్యాదులో బాధిత వినియోగదారుడు పేర్కొన్నట్లు సమాచారం. 

మరిన్ని వార్తలు