స్వస్థలాలకు చేరిన వీర జవాన్ల మృతదేహాలు

18 Jun, 2020 10:54 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: లద్దాఖ్‌లోని గాల్వన్ లోయా వద్ద చైనాతో జరిగిన ఘర్షణలో ప్రాణాలు అర్పించిన సైనికుల మృతదేహాలు బుధవారం వారి స్వస్థలాలకు చేరుకున్నాయి. సోమవారం రాత్రి చైనా దాడిలో 20 మంది భారత సైనికులు వీరమరణం పోందినట్లు ఆర్మీ అధికారులు మంగళవారం ప్రకటించిన విషయం తెలిసిందే. మరణించిన సైనికుల మృతదేహాలను ఉంచిన శవపేటికకు జాతీయా జెండాను కప్పి సైనిక లాంఛనాలతో వారి స్వస్థలాలకు తరలించారు. కాగా మరణించిన సైనికుల్లో బీహార్‌కు చెందివారు అయిదుగురు, పంజాబ్‌కు చెందిన నలుగురు, పశ్చిమ బెంగాల్‌, ఓడిశా, జార్ఖండ్‌కు రాష్ట్రాలకు చెందిన వారు ఇద్దరూ చొప్పున ఉన్నారు.  చత్తీస్‌‌గడ్‌, మధ్యప్రదేశ, హిమాచల్‌ ప్రదేశ్‌, తమిళనాడు, తెలంగాణ చెందిన ఒక్కొక్కరూ ఉన్నారు. కాగా ఇవాళ సైనికుల మృతదేహాలకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు గౌరవ లాంఛనాలతో అంత్యక్రియలు జరపనున్నాయి. (సూర్యాపేటలో కల్నల్‌ సంతోష్‌ అంతిమయాత్ర)

మరణించిన సైనికుల పేర్లు..
1. కల్నల్‌ బి. సంతోష్‌బాబు (తెలంగాణ)
2. నాయిబ్ సుబేదార్ నుదురం సోరెన్
3. నాయబ్ సుబేదార్ మన్‌దీప్ సింగ్
4. నాయబ్ సుబేదార్ సత్నం సింగ్
5. హవిల్దార్ కె పళని
6. హవిల్దార్ సునీల్ కుమా
7. హవిల్దార్ బిపుల్ రాయ్
8. నాయక్ దీపక్ కుమార్
9. సిపాయి రాజేష్ ఒరాంగ్
10. సిపాయి కుందన్ కుమార్ ఓజా
11. సిపాయి గణేష్ రామ్
12. సిపాయి చంద్రకాంత ప్రధాన్
13. సిపాయి అంకుష్
14. సిపాయి గుర్బిందర్
15. సిపాయి గుర్తేజ్ సింగ్
16. సిపాయి చందన్ కుమార్
17. సిపాయి కుందన్ కుమార్
18. సిపాయి అమన్ కుమార్
19. సిపాయి జై కిషోర్ సింగ్
20. సిపాయి గణేష్ హన్స్‌డా

అడ్డుకున్న సంతోష్‌ నేతృత్వంలోని దళం

సూర్యాపేటలో కల్నల్‌ సంతోష్‌బాబు అంత్యక్రియలు..
కాగా తెలంగాణకు చెందిన కమాండర్‌ కల్నల్‌ సంతోష్‌బాబు మృతదేహాన్ని బుధవారం రాత్రి దేశ రాజధాని న్యూఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో రాత్రి హైదరాబాద్‌లోని హకీంపేటలోని వైమానిక దళానికి తరలించారు. ఆ తర్వాత విద్యానగర్‌లోని ఆయన నివాసానికి తీసుకువచ్చారు. జాతియ జెండా కప్పిన సంతోస్‌ బాబు శవపేటికను సైనికులు అంబులెన్స్‌ నుంచి బయటకు తీస్తుండగా అక్కడ ఉన్నవారంతా ఒక్కసారిగా ఉద్వేగానికి లోనవుతూ ‘సంతోష్ బాబు అమర్ హ’ అంటూ నినాదాలు చేశారు.  గురువారం ఉదయం కల్నల్‌ సంతోష్‌బాబు అంత్యక్రియలు సైనిక లాంఛనాలతో ఆయన స్వస్థలం సూర్యాపేటలో ముగిశాయి.  సంతోష్‌ అంత్యక్రియలకు మంత్రి జగదీశ్‌రెడ్డితో పాటు రాష్ట్ర ఉన్నతస్థాయి అధికారులు, పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు. 

మరిన్ని వార్తలు