‘కోల్‌గేట్’ దర్యాప్తు అధికారికి రాష్ట్రపతి పతకం

15 Aug, 2014 01:24 IST|Sakshi

న్యూఢిల్లీ: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా 24 మంది ప్రతిభావంతులైన అధికారులకు ప్రకటించిన రాష్ట్రపతి పతకాల జాబితాలో బొగ్గు కుంభకోణం కేసులో దర్యాప్తునకు నేతృత్వం వహించేందుకు సుప్రీంకోర్టు పునర్‌నియమించిన డీఐజీ రవికాంత్ కూడా ఉన్నారు. పెరల్స్ గ్రూప్ బ్యాంకింగ్ సేవల మోసం కేసులో ఇన్‌చార్జిగా ఉన్న సీబీఐ జేడీ రాజీవ్ శర్మ, కాశ్మీర్‌లోని షోపియన్‌లో ఇద్దరు మహిళల హత్యకేసును దర్యాప్తు చేసిన డీఐజీ రతన్ సంజ య్‌లు కూడా రాష్ట్రపతి పతకాలు అందుకోనున్నారు. టట్రా ట్రక్కుల స్కాంపై దర్యాప్తుకు నేతృత్వం వహించిన అధికారులకూ రాష్ట్రపతి పోలీసు పతకాలు దక్కాయి.  
 

మరిన్ని వార్తలు