ప్రతీకారం తీర్చుకోవడానికి వస్తున్నాం!

21 May, 2016 16:43 IST|Sakshi
ప్రతీకారం తీర్చుకోవడానికి వస్తున్నాం!

'మేం తిరిగి వస్తున్నాం. బాబ్రి మసీదు విషయంలో, కశ్మీర్, గుజరాత్‌, ముజఫర్‌నగర్‌లలో ముస్లిలంను చంపిన విషయంలో చేతుల్లో కత్తులు పట్టుకొని ప్రతీకారం తీర్చుకునేందుకు వస్తున్నాం'.. అంటూ ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాద సంస్థ తాజాగా ఓ వీడియోను ఆన్‌లైన్‌లో పోస్టుచేసింది.

22 నిమిషాల నిడివితో అరబిక్ భాషలో ఉన్న ఈ డాంక్యుమెంటరీలో భారత్‌కు చెందిన వ్యక్తులుగా భావిస్తున్న ఉగ్రవాదులు తమ సంస్థలో ఏయే హోదాలో ఉన్నారో వెల్లడించింది. 2014 నుంచి ఇరాక్‌, సిరియాలో ఫైటర్లుగా కొనసాగుతున్న ఐదుగురు జిహాదిస్టుల ఇంటర్వ్యూలను ఇందులో పొందుపర్చింది. శుక్రవారం ఉదయం ఆన్‌లైన్‌లో ఈ వీడియో దర్శనమిచ్చింది. భారత్‌, దక్షిణాసియాపై ప్రధాన దృష్టితో ఐఎస్ఐఎస్‌ విడుదల చేసిన తొలి వీడియో ఇది కావడం గమనార్హం.

ఇందులోని పేర్కొన్న భారతీయ వ్యక్తుల్లో ఒక్కడిని మాత్రమే ఇప్పటివరకు గుర్తించారు. 2014లో సిరియా చేరుకున్న థానెకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి ఫహద్‌ తన్వీర్ షైక్‌ ఇంటర్వ్యూలో ఈ వీడియోలో ఉండటం గమనార్హం. అతడు మరో ఇద్దరితో కలిసి ఐఎస్ఐఎస్‌లో చేరేందుకు సిరియా వెళ్లాడు. షైక్‌ అబూ అమర్‌ ఆల్‌ హిందీ మారుపేరుతో ఈ వీడియోలో మాట్లాడాడు. బాబీ మసీదు విధ్వంసం, కశ్మీర్‌, గుజరాత్‌, ముజఫర్‌ నగర్‌లో ముస్లింల హత్యలకు ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్‌ వస్తున్నామని అతడు హెచ్చరించాడు. అతనితోపాటు సిరియా వెళ్లి గత ఏడాది రఖ్ఖాలో జరిగిన బాంబు దాడిలో చనిపోయినట్టుగా భావిస్తున్న తన స్నేహితుడు, థానెకు చెందిన షమిమ్‌ టాంకికి షైక్‌ నివాళులర్పించాడు. సిరియాకు వెళ్లిన అతని మరో స్నేహితుడు అరీబ్‌ మజిద్‌ ప్రస్తుతం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధీనంలో ఉన్నాడు.
 

>
మరిన్ని వార్తలు