కరోనా నియంత్రణకు రంగంలోకి కమాండోలు

10 Jul, 2020 16:04 IST|Sakshi

తిరువనంతపురం: కరోనా కేసుల నియంత్రణకు కేరళ ప్రభుత్వం కమాండోలను రంగంలోకి దించింది. వివరాల్లోకెళ్తే.. తిరువనంతపురంలోని పూంతారా గ్రామంలో కరోనా కేసులు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. దీనికితోడు ప్రజలు భౌతిక దూరం, మాస్కులు ధరించడం వంటి నిబంధనలు పాటించకుండా రోడ్ల మీదకు వస్తుండటంతో కేరళ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది.

బుధవారం రోజున పూంతారా గ్రామ సరిహద్దులను మూసివేస్తూ.. అనవసరంగా ఇళ్ల నుంచి బయటకు వచ్చే ప్రజలను నియంత్రించడానికి 25 మంది స్పెషల్‌ ఆర్మ్‌డ్‌ ఫోర్స్‌ కమాండోలను మొహరించారు. కాగా.. లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించిన నాటినుంచి కరోనా కేసుల వ్యాప్తి ఎక్కువగా ఉండటంతోనే తాజాగా కేరళ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే కేరళలో ఇప్పటిదాకా 6,195 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా, 2,609 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మరో 3,559 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. చదవండి: మరణాల రేటు 2.72 శాతమే: కేంద్రం

మరిన్ని వార్తలు