ప్రైవేట్‌ ఆస్పత్రుల ఫీ‘జులుం’ చెల్లదు..

19 Jun, 2020 14:32 IST|Sakshi

ఫీజులపై నిపుణుల కమిటీ సిఫార్సు

సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీలో కరోనా వైరస్‌ మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో రోగుల చికిత్సకు లక్షలాది రూపాయలు వసూలు చేస్తుండటం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఢిల్లీ ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో కోవిడ్‌-19 చికిత్స రేట్లను తగ్గించాలని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన అత్యున్నత కమిటీ సిఫార్సు చేసింది. నీతి ఆయోగ్‌ సభ్యులు డాక్టర్‌ వీకే పాల్‌ నేతృత్వంలో ఏర్పాటైన ఈ కమిటీ రాజధాని వాసులకు ఊరట కల్పించే సిఫార్సులు చేసింది.

ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ఐసోలేషన్‌ బెడ్‌కు రోజుకు రూ. 8000-10,000, ఐసీయూలో ఉండే రోగులకు రూ 13,000-15,000, వెంటిలేటర్‌పై చికిత్సకు రూ 15,000-18,000 వరకూ ప్రైవేట్‌ ఆస్పత్రులు వసూలు చేయవచ్చని ఈ కమిటీ పేర్కొంది. పీపీఈ ఖర్చులు కూడా కలిపి ఈ మొత్తానికి మించి ఏ ఒక్క ప్రైవేట్‌ ఆస్పత్రి వసూలు చేయరాదని సూచించింది. ప్రస్తుతం పలు ప్రైవేట్‌ ఆస్పత్రులు ఐసోలేషన్‌ బెడ్స్‌కు రూ 25,000, ఐసీయూల్లో రోగులకు రోజుకు రూ 40,000 వసూలు చేస్తుండగా, వెంటిలేటర్‌పై ఉన్న రోగులకు రోజుకు రూ 44,000-54,000 వరకూ వసూలు చేస్తున్నాయి.

చదవండి : కరోనా ఎఫెక్ట్‌ : ఆ జంటకు డిజిటల్‌ విడాకులు

మరిన్ని వార్తలు