అలీగఢ్ లో అలజడి

24 Jul, 2016 14:38 IST|Sakshi
అలీగఢ్: ఉత్తరప్రదేశ్ లోని కైరానా లోని వలసలు, మథురలో చెలరేగిన ఘర్షణలు మరువకముందే అలీగఢ్ మత ఘర్షనలు చోటు చేసుకున్నాయి. అలీగఢ్ లోని బాబ్రి మండిలో రెండు వర్గాల మధ్య  ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో ఈ ప్రాంతంలో ఉండలేమంటూ మెజారిటీ  వర్గానికి చెందిన ప్రజలు వలస బాట పట్టారు. కొన్ని రోజుల క్రితం 19 ఏళ్ల హిందూ యువతిని కొందరు దుండగలు అవమానించారు. ఇది రెండు వర్గాల ప్రజల మధ్య ఘర్షణకు దారి తీసింది.

శాంతియుత పరిస్ధితులు నెలకొనేందుకు భద్రతా దళాలు కృషి చేస్తున్నాయి. ఇక్కడ ఆడపిల్లలకి రక్షణ లేదని అందుకే ఈ ప్రాంతం నుంచి వెళ్లిపోతున్నామని సుధా వర్షిణి (38) ఆవేదన వ్యక్తం చేశారు. అమ్మాయిలు పాఠశాలకు వెలుతుంటే కూడా వేధింపులకు గురిచేస్తున్నారని  తెలిపారు. దీనిపై స్పందించిన జిల్లా మేజిస్టేట్ అవదేశ్ తివారీ వారికి రక్షణ కల్పిస్తామని అన్నారు.
Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా