పోటీతత్వంతో అభివృద్ధి: ప్రధాని మోదీ

10 Mar, 2018 12:24 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రజాప్రతినిధులు నిరంతరం కొత్త విషయాలు నేర్చుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. శనివారం ఢిల్లీలోని పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌ లో జరిగిన జాతీయ ప్రజాప్రతినిధుల సదస్సులో ఆయన ప్రసంగించారు. సామాజిక న్యాయంపై విస్తృత చర్చలు జరుగుతున్నాయని అన్నారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందినప్పుడే సామాజిక న్యాయం సాధ్యం అవుతుందన్నారు. కొన్ని జిల్లాలు అభివృద్ధి చెందాయాని, మరికొన్ని జిల్లాలు వెనకబడి ఉంటాయని మోదీ అన్నారు. రాష్ట్రాల మధ్య పోటీ ఉన్నట్లే దేశాల మధ్య కూడా పోటీ ఉంటుందన్నారు. పోటీ తత్వం వల్ల రాష్ట్రాలు, దేశాలు అభివృద్ధి చెందుతాయని ప్రధాని పేర్కొన్నారు. ఈ సదస్సుకు లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌, కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు.

మరిన్ని వార్తలు