21 మంది తెలుగు ఎంపీలపై ముజఫర్ పూర్ లో కేసు

14 Feb, 2014 17:22 IST|Sakshi
21 మంది తెలుగు ఎంపీలపై ముజఫర్ పూర్ లో కేసు
భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రతిష్టను మంటగలిపారంటూ ఆంధ్రప్రదేశ్ కు చెందిన 21 మంది ఎంపీలపై బీహార్ లోని ముజఫర్ పూర్ లో కేసు నమోదు చేశారు. ఆంధ్రప్రదేశ్ ఎంపీలపై రాజద్రోహం, ఇతర కేసులను నమోదు చేశారు. 
 
సెక్షన్ 504, 323, 124బీ, 308, 120బీ కింద చీఫ్ జుడిషిలయ్ మేజిస్ట్రేట్ ఎస్ పీ సింగ్ కోర్టులో స్థానిక న్యాయవాది సుధీర్ కుమార్ ఓజా ఫిర్యాదు చేశారు. లోకసభలో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా సభ గౌరవాన్ని కాపాడాల్సిన సభ్యులే గలాటా సృష్టించడం, ఇతర సభ్యులపై పెప్పర్ స్పే చల్లడం భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు మచ్చ తెచ్చేలా ఉంది అని ఫిర్యాదులో ఓజా పేర్కోన్నారు.  
 
ఎంపీల ప్రవర్తనపై దినపత్రికలో వచ్చిన కథనం తలదించుకునేలా ఉందని ఓజా తెలిపారు. పార్లమెంట్ ప్రతిష్టకు భంగం కలిగేలా ప్రవర్తించిన సభ్యులపై చర్యలు తీసుకోవాలని ఓజా పిటిషన్ లో తెలిపారు. పిటిషన్ పై విచారణను మార్చి 7 తేదికి వాయిదా వేశారు. 
మరిన్ని వార్తలు