అసభ్యంగా ప్రవర్తించిన ఆప్ ఎమ్మెల్యే..

23 Jun, 2016 16:02 IST|Sakshi
అసభ్యంగా ప్రవర్తించిన ఆప్ ఎమ్మెల్యే..

న్యూఢిల్లీః నియోజకవర్గంలో నీటి సమస్యపై మాట్టాడేందుకు వచ్చిన మహిళపై అసభ్యంగా ప్రవర్తించారంటూ ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే దినేష్ మొహానియా ఆరోపణలు ఎదుర్కొటున్నారు. స్థానిక నీటి సమస్యపై ఎమ్మెల్యేకు వివరించేందుకు కొద్ది రోజులుగా ఆయన ఆఫీస్ కు వెడుతున్న ఓ మహిళ... సదరు ఎమ్మెల్యే.. తనతోపాటు వచ్చిన మహిళలను సైతం నెట్టివేసి, అవమానించారని పేర్కొంది. మొహానియాపై కేసు నమోదు చేసి, ఆయన్ను అరెస్టు చేయాలని డిమాండ్ చేసింది.

ఢిల్లీ సంగమ్ విహార్ నియోజకవర్గం ఆప్ ఎమ్మెల్యే దినేష్ మొహానియా మహిళలతో ఆసభ్యంగా ప్రవర్తించారంటూ ఆయనపై కేసు నమోదైంది. తాను నీటి సమస్యపై మాట్లాడేందుకు తరచుగా ఆయన కార్యాలయానికి వెడుతున్నానని, అయినప్పటికీ కనీసం గుర్తు కూడ పట్టనట్లుగా చేసిన మొహానియా తనపై అసభ్యంగా ప్రవర్తించారని, తనతోపాటు వచ్చిన వారిని కూడ అక్కడినుంచీ నెట్టివేశారని ఆమె పోలీసులకు కంప్లైంట్ చేసింది. నియోజకవర్గ ప్రజలన్న కనీస మర్యాదకూడ లేకుండా మొహానియా మహిళలపై దురుసుగా, అసభ్యంగా ప్రవర్తించడం అన్యాయమని, ఆయన్ను వెంటనే అరెస్టు చేయాలని సదరు మహిళ పోలీసులను డిమాండ్ చేసింది.

మొహానియా కార్యాలయానికి వచ్చిన మహిళలందరినీ ఆయన బయటకు గెంటి అవమానించారని, అయితే  తాము కూడ అదేతీరులో ప్రవర్తించాల్సి వచ్చిందని, కొడుతుంటే చేతులు కట్టుకొని కూర్చునేవారు ఎవరుంటారంటూ బాధితురాలు ప్రశ్నించింది? మొహానియా ప్రవర్తనపై విచారించి, ఆయన్ను వెంటనే ఆరెస్టు చేయడంతోపాటు, తమ ప్రాంతంలోని నీటి సమస్యపై చర్యలు తీసుకోవాలని బాధితురాలు వాపోయింది.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు