ముజఫర్‌పూర్‌ విషయంలో ఎన్‌హెచ్‌ఆర్‌సీకి ఫిర్యాదు

28 May, 2020 17:03 IST|Sakshi

పాట్నా: ముజఫర్‌ నగర్‌ రైల్వే స్టేషన్‌లో జరిగిన హృదయ విదారక ఘటనకు సంబంధించి బీహార్‌ ప్రభుత్వం, రైల్వేపై జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు అందింది. ముజఫర్‌ నగర్‌ రైల్వే స్టేషన్‌లో ఒక మహిళ చనిపోగా, ఆమె కొడుకు శవం దగ్గర ఏడుస్తున్న వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌ అయ్యింది.  అయితే ఆ మహిళ రైల్వే స్టేషన్‌లో సరైన ఆహారం, వసతి లేకే చనిపోయిందని లాయర్‌ మహమ్మూద్‌ ఎన్‌ఆర్‌సీకి ఫిర్యాదు చేశారు. (కోహ్లి.. అనుష్కకు విడాకులు ఇచ్చేయ్)

మే 25న రైల్వే స్టేషన్‌లో దీనికి సంబంధించి రికార్డు అయిన సీసీ ఫుటేజీని సీజ్‌ చేయాలని కోరారు. బీహార్‌ ప్రభుత్వం, రైల్వే శాఖలపై  తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. అంతే కాకుండా సదరు మహిళ కుటుంబానికి తగిన నష్టపరిహారం చెల్లించాలని కూడా ఆదేశించాలని ఎన్‌హెచ్‌ఆర్‌సీని కోరారు. బీహార్‌ రైల్వే కనీస వసతులు కూడా రైళ్లో కల్పించలేదని, శిశు, మహిళ సంరక్షణ విషయంలో విఫలమైందని ఎన్‌హెచ్‌ఆర్‌సీకి తెలిపారు. ఆర్టికల్‌ 21 ప్రకారం ప్రతి ఒక్కరికి జీవించే హక్కును రాజ్యాంగం కల్పించిందని ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. సదురు మహిళ మే 24న శ్రామిక్‌రైల్లో గుజరాత్‌ నుంచి బయలుదేరి మే 25 కు గుజరాత్‌కు చేరుకుంది. అయితే ఆమెకు సరైన ఆహారం, వసతి లభించక మరణించింది. (వైరస్ భయం: ఫ్లైట్లో నలుగురు)

మరిన్ని వార్తలు