అక్కడ మరోసారి పూర్తి లాక్‌డౌన్‌!

10 Jul, 2020 18:45 IST|Sakshi

ముంబాయి: దేశంలో కరోనా కేసులు రోజురోజుకు విజృంభిస్తున్నాయి. ఇక మహారాష్ట్ర కరోనా వైరస్‌ కేసుల సంఖ్యలో దేశంలో మొదటి స్థానంలో ఉంది. ఈ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు సంఖ్య చైనాలోని కరోనా కేసులను కూడా దాటేశాయి. ఇప్పుడు మహా సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. 11 రోజుల పాటు పుణె, వాటి పరిసర ప్రాంతంలో పూర్తి లాక్‌డౌన్‌ను విధించనున్నట్లు శుక్రవారం ప్రకటించింది. జూలై 13-23వరకు ఈ ప్రాంతాలలో పూర్తి  లాక్‌డౌన్‌ను విధించనున్నారు. గురువారం ఒక్కరోజే ఈ జిల్లాలో 1803 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ జిల్లాలో మొత్తం కేసులు 34,399కి  చేరుకోగా, చనిపోయిన వారి సంఖ్య 978కు చేరుకుంది. ఈ ప్రాంతంలో లాక్‌డౌన్‌ విధించిన 11రోజుల పాటు నిత్యవసర సరుకుల దుకాణాలు మినహా ఇంకేమీ పనిచేయమని జిల్లా కలెక్టర్‌ తెలిపారు. ఈ లాక్‌డౌన్‌ ద్వారా ఈ కరోనా వైరస్‌ చైన్‌ను వీడదీయవచ్చు అని ఆయన చెప్పారు.

చదవండి: (క‌రోనా: యూపీ స‌ర్కార్ కీలక నిర్ణ‌యం)  

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు