కూలీల ఇక్కట్లపై నేడు ప్రతిపక్షాల భేటీ

22 May, 2020 06:23 IST|Sakshi

న్యూఢిల్లీ:  దేశవ్యాప్త లాక్‌డౌన్‌ వల్ల వలస కూలీలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై చర్చించేందుకు ప్రతిపక్షాల నేతలు శుక్రవారం సమావేశం కానున్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధినేత సోనియాగాంధీ ఆధ్వర్యంలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరిగే ఈ భేటీలో వివిధ పార్టీలకు చెందిన  20 మంది నేతలు పాల్గొంటారని అంచనా. ప్రధానంగా వలస కూలీల సమస్యలను పరిష్కరించే విషయంలో అనుసరించాల్సిన ఉమ్మడి వ్యూహంపై చర్చస్తారు. అలాగే పలు రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలు కార్మిక చట్టాలను నీరుగారుస్తుండడంపైనా చర్చించే అవకాశం ఉంది. కేంద్రం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీపై ప్రతిపక్ష నేతలు నిరసన వ్యక్తం చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు 17 ప్రతిపక్షాలు అంగీకారం తెలిపాయి.

మరిన్ని వార్తలు