కేంద్రానికి కాంగ్రెస్ విజ్ఞప్తి‌

25 Apr, 2020 18:49 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌ విషయంలో కేంద్రం మరోసారి ఆలోచించాలని కాంగ్రెస్‌నేత కపిల్‌ సిబల్‌ సూచించారు.  విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం కరోనావైరస్ సంక్షోభాన్ని పరిష్కరించడానికి జాతీయ ప్రణాళికను రూపొందించాలని కాంగ్రెస్ పార్టీ  శనివారం కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించింది.  కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కపిల్ సిబల్ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... లాక్‌డౌన్‌  విధానంపై  ప్రభుత్వం పునరాలోచించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.  దేశంలో ఒక వైపు ప్రజలను లాక్‌డౌన్ చేయడం, మరోవైపు  ఆర్థిక వ్యవస్థను లాక్అవుట్ చేయడం ఉండకూడన్నారు.  (తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాం)
లాక్‌డౌన్‌ విధించే ముందు కేంద్రం రాష్ట్రాలతో ఎందుకు సంప్రదింపులు జరుపలేదు అని కపిల్‌ ప్రశ్నించారు. లాక్‌డౌన్‌ కారణంగా ప్రజలు రోడ్ల మీద ఉన్నారని, వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. తమ పార్టీ మంచి సలహాలనే ఇస్తోందని, కరోనా విపత్కర పరిస్థితుల్లో తాము ప్రభుత్వంతోనే ఉన్నామని కపిల్‌ స్పష్టం చేశారు. అదేవిధంగా ఇటువంటి  సంక్షోభ సమయంలో జస్టిస్ డెలివరీ వ్యవస్థను తప్పనిసరి సేవగా చేస్తూ ఒక విధానాన్ని రూపొందించాలని ఆయన న్యాయవ్యవస్థకు పిలుపునిచ్చారు. ఇక దీంతో పాటు లాక్‌డౌన్‌​  సమయంలో గ్రౌండ్ రియాలిటీల గురించి ఎటువంటి అవగాహన లేని అధికారులు  ప్రభుత్వ పాలసీలను రూపొందిస్తున్నారని కపిల్‌ సిబల్ ఆరోపించారు. ఇదిలా ఉండగా వచ్చేవారంతో లాక్‌డౌన్‌ ముగుస్తుండటంతో  ప్రధాని నరేంద్రమోదీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సోమవారం సమావేశం కానున్నారు. ( నూనెతో కరోనా చనిపోతుంది)

>
మరిన్ని వార్తలు