చత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌ వనవాసం ముగిసింది..

12 Aug, 2018 20:12 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : చత్తీస్‌గఢ్‌లో 15 ఏళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్‌కు వనవాసం ముగిసిందని ఆ రాష్ట్ర విపక్ష నేత టీఎస్‌ సింగ్‌ దేవ్‌ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం సీతాదేవి శ్రీరాముడిని వరించిన తరహాలో కాంగ్రెస్‌ సీఎంను స్వయంవరం ద్వారా సీఎంను ఎంపిక చేస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. 14 ఏళ్ల రాముడి వనవాసం ముగిసినట్టుగానే రాష్ట్రంలో తదుపరి తమ ప్రభుత్వం ఏర్పాటవుతుందని జోస్యం చెప్పారు.

పాలక బీజేపీని అధికారం నుంచి తప్పించేందుకు భావసారూప్యం కలిగిన విపక్షాలతో కూటమి ఏర్పాటుకు తమ పార్టీ సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. తమ పార్టీ ఎన్నికలకు ముందు సీఎం అభ్యర్థిని ప్రకటించబోదని అన్నారు.

2003లో బీజేపీ రమణ్‌ సింగ్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించలేదన్నారు. చత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘనవిజయం సాధించి అధికార పగ్గాలు చేపడుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఏడాది నవంబర్‌ -డిసెంబర్‌లో 90 అసెంబ్లీ స్ధానాలున్న చత్తీస్‌గఢ్‌లో ఎన్నికలు జరగనున్నాయి.

మరిన్ని వార్తలు