కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్లలో 456 ఆర్డినెన్స్లు

21 Jan, 2015 11:52 IST|Sakshi

ఢిల్లీ: పార్లమెంట్ సమావేశాలు లేని సమయంలో అత్యవసర పరిస్థితుల్లో ప్రభుత్వం ఆర్డినెన్స్లు జారీ చేస్తుంది. ఇవి చట్టాలుగా మారాలంటే ఆర్డినెన్స్ లు జారీ చేసిన తర్వాత పార్లమెంట్ ఆమోదించాల్సి ఉంటుంది. ఎనిమిది నెలల కాలంలోనే నరేంద్రమోదీ ప్రభుత్వం 9 ఆర్డినెన్స్లు జారీ చేసి మరిన్నింటిని జారీ చేసే ప్రయత్నంలో ఉంది.

 

ముఖ్యమైన బిల్లులని చర్చించకుండానే ఆర్డినెన్స్లని తీసుకురావడంపై ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. చట్టాలు చేయడానికి సమయం ఉన్న సందర్భాల్లో కూడా ఆర్డినెన్స్లని జారీ చేయడం సరైంది కాదని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సోమవారం వ్యాఖ్యానించారు. దీంతో ఈ ఆర్డినెన్స్ల జారీలపై సర్వత్రా చర్చ జరుగుతోంది.


భారత ప్రభుత్వం 1952-2014 మధ్య మొత్తం 637 ఆర్డినెన్స్లు జారీ చేసింది. అంటే అప్పటి నుంచి సరాసరిగా దాదాపు నెలకి ఒక ఆర్డినెన్స్ జారీ అయింది. కాంగ్రెస్ పార్టీ  ప్రస్తుతం ఈ ఆర్డినెన్స్ల జారీ మీద మోదీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. కానీ మొత్తం జారీ చేసిన ఆర్డినెన్స్లలో 456  కేవలం 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఆరుగురు ప్రధానులు జారీ చేసినవే.

 

వీటిలో జవహర్లాల్ నెహ్రూ 70, ఇందిరాగాంధీ 77, రాజీవ్ గాంధీ 35, పీవీ నరసింహరావు 77 ఆర్డినెన్స్ లని జారీచేశారు. మన్మోహన్ సింగ్ ప్రధాని గా యూపీఏ 1 లో 36 ఆర్డినెన్స్లని జారీచేయగా యూపీఏ 2 హయాంలో కొంత మెరుగుపడి కేవలం 25మాత్రమే జారీ చేశారు.అంటే పదేళ్ల వ్యవధిలో సంవత్సరానికి ఆరు సార్లు మాత్రమే ఆర్డినెన్స్ల సహాయాన్ని యూపీఏ ప్రభుత్వం తీసుకుంది.

>
మరిన్ని వార్తలు