పుట్టినరోజు నాడూ వదలని రెబల్స్‌

19 Jun, 2018 13:09 IST|Sakshi
రాహుల్‌ గాంధీ - షెహ్జాద్‌ (ఫైల్‌ ఫోటో)

ముంబై, మహారాష్ట్ర : రాజకీయాల పరంగా ఎన్ని విబేధాలున్నప్పటికి ప్రధానమంత్రి మోదీతో సహా పలువురు రాజకీయ నాయకులు ‘బర్త్‌డే బాయ్‌’ రాహుల్‌ గాంధీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కానీ కాంగ్రెస్‌ పార్టీ రెబల్స్‌ మాత్రం ఈ రోజు కూడా రాహుల్‌ను విడిచిపెట్టడం లేదు. పూణెకు చెందిన ఓ కాంగ్రెస్‌ పార్టీ రెబల్‌ రాహుల్‌కు వెరైటీ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు.

మహారాష్ట్ర పూణెకు చెందిన షెహ్జాద్‌ తన ట్విటర్‌లో ‘ఇప్పటికే అర్థ శతాబ్దాన్ని పూర్తి చేసుకున్న రాహుల్‌ గాంధీ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీరు నిండు నూరేళ్లు జీవించాలని కోరుకుంటున్నాను. ప్రస్తుతం మీరు బలవంతంగా చేస్తున్న ఈ ఉద్యోగాన్ని(కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష పదవి) వదిలి, కనీసం 2019 నాటికైనా  మీ మనసుకు నచ్చిన ఉద్యోగాన్ని పొందాలని ఆశిస్తున్నాను’ అంటు ట్వీట్‌ చేసాడు.

షెహ్జాద్‌ చేసిన మెసేజ్‌...
Happy Birthday Rahul Gandhi ji! As you near half a century, I pray for your long life, and hope in 2019 you can pursue a profession which your heart really intends to pursue, rather than a job you have been forced to take up..

గతంలోను...
షెహ్జాద్‌ రాహుల్‌ను విమర్శించడం ఇదే ప్రథమం కాదు. గతంలో రాహుల్‌ను కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకున్నప్పుడు కూడా షెహ్జాద్‌ తీవ్రమైన వ్యాఖ్యలు చేసాడు. ‘రాహుల్‌ గాంధీ కాంగ్రెస్‌ పార్టీకి అధ్యక్షుడిగా లేరు. వారసత్వం ప్రకార పట్టాభీషక్తుడయ్యే మొఘల్‌ సామ్రజ్యపు రాజులా ఉన్నారని విమర్శించాడు. రాహుల్‌ ఎన్నిక ప్రక్రియ మొఘల్‌ తరహా వారసత్వ పట్టాభీషేక ప్రక్రియాలా ఉంద’ని ఎద్దేవా చేశాడు.

మరిన్ని వార్తలు