రాఫెల్‌ డీల్‌లో ఆ క్లాజు లేదు..

23 Jul, 2018 14:58 IST|Sakshi
సీనియర్‌ కాంగ్రెస్‌ నేత ఏకే ఆంటోనీ (ఫైల్‌ఫోటో)

సాక్షి, న్యూఢిల్లీ : రాఫెల్‌ ఒప్పందంలో ధరల వెల్లడికి సంబంధించి భారత్‌-ఫ్రాన్స్‌ మధ్య 2008లో జరిగిన డీల్‌లో ఎలాంటి క్లాజ్‌ లేదని కాంగ్రెస్‌ పేర్కొంది. ఈ ఒప్పందంపై మోదీ సర్కార్‌ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని రక్షణ శాఖ మాజీ మంత్రి, సీనియర్‌ కాంగ్రెస్‌ నేత ఏకే ఆంటోనీ ఆరోపించారు. ప్రతి విమానం ధరలను ప్రభుత్వం వెల్లడించాలని డిమాండ్‌ చేశారు. ఈ ఒప్పందాన్ని కాగ్‌, పార్లమెంటరీ పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ పరిశీలించే క్రమంలో ప్రభుత్వం రాఫెల్‌ జెట్‌ ధరల వివరాల్లో గోప్యత పాటించలేదని స్పష్టం చేశారు.

రాఫెల్‌ ఒప్పందానికి సంబంధించి ధరల వెల్లడిపై పార్లమెంట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ దేశాన్ని తప్పుదారిపట్టించినందుకు వారు వివరణ ఇవ్వాలని కాంగ్రెస్‌ నేత ఆనంద్‌ శర్మ డిమాండ్‌ చేశారు.

రాఫెల్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ ధరను వెల్లడించడంపై ఫ్రాన్స్‌ ప్రభుత్వానికి అభ్యంతరం లేదని ఫ్రెంచ్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో స్పష్టం చేశారని చెప్పారు. ప్రధాని, రక్షణ మంత్రి పార్లమెంట్‌ను తప్పుదారి పట్టించేలా వ్యవహరించడం సభా హక్కుల ఉల్లంఘనేనని కాంగ్రెస్‌ నేత రణ్‌దీప్‌ సింగ్‌ సుర్జీవాలా ఆరోపించారు.

మరిన్ని వార్తలు