కాంగ్రెస్ వాకౌట్

2 Mar, 2015 13:03 IST|Sakshi

ముఫ్తీ వ్యాఖ్యలు తమనే కాకుండా దేశంలోని ప్రజలందరినీ బాధపెట్టాయని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే అన్నారు. ఎన్నికల కమిషన్తోపాటు పోలీసు బృందాలు, ఇతర అధికారులు ఎంతో కష్టపడి ఎన్నికలు నిర్వహిస్తే ఆ క్రెడిట్ పాక్ కట్టబెట్టారని, ఉగ్రవాదులకు ఇచ్చారని మండిపడ్డారు. సోమవారం ముఫ్తీ వ్యాఖ్యలపై ధుమారం రేగిన అనంతరం బీజేపీ బాధ్యతయుతమైన సమాధానం చెప్పలేదంటూ లోక్సభ నుంచి కాంగ్రెస్ పార్టీ నేతలు వాకౌట్ చేశారు. ప్రధాని నరేంద్రమోదీ ఈ అంశంపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేయగా రాజ్నాథ్ సింగ్ అందుకు కుదరదన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి కారణం అక్కడి ప్రజలే అని చెప్పారు. ప్రధానితో వివరణ ఇప్పించడం సాధ్యం కాదని చెప్పడంతో కాంగ్రెస్ ఎంపీలు వాకౌట్ చేశారు.


 

>
మరిన్ని వార్తలు