పోలీస్‌ స్టేషన్‌ ఎదుట బీఫ్‌ కర్రీ పంపిణీ..

19 Feb, 2020 11:04 IST|Sakshi

కోజికోడ్‌ : కేరళలో పోలీస్‌ ట్రైనీల మెనూలో బీఫ్‌ను తొలగించారన్న వార్తల నేపథ్యంలో కోజికోడ్‌లోని ఓ పోలీస్‌ స్టేషన్‌ ఎదుట కాంగ్రెస్‌ కార్యకర్తలు బీఫ్‌ కర్రీ, బ్రెడ్‌ను పంచారు. ముక్కం పోలీస్‌ స్టేషన్‌ వద్ద కేపీసీసీ ప్రధాన కార్యదర్శి, అడ్వకేట్‌ కే ప్రవీణ్‌ కుమార్‌ బీఫ్‌ కర్రీ, బ్రెడ్‌ పంపిణీని ప్రారంభించారు. ప్రధాని మోదీని కేరళ సీఎం పినరయి విజయన్‌ ప్రమాణ స్వీకరాం చేసిన వెంటనే కలిశారని, ఆయన ప్రోద్బలంతో మోదీ, షాలకు క్లీన్‌ చిట్‌ ఇచ్చిన లోక్‌నాథ్‌ బెహెరాను డీజీపీగా నియమించారని ప్రవీణ్‌ కుమార్‌ ఆరోపించారు. సంఘ్‌ అజెండాను పినరయి విజయన్‌ తలకెత్తుకున్నారని, ఆయన రెండు నాల్కల ధోరణిని ప్రజల్లో కాంగ్రెస్‌ పార్టీ ఎండగడుతుందని అన్నారు. మరోవైపు పోలీస్‌ ట్రైనీల మెనూ నుంచి బీఫ్‌ను తొలగిస్తారన్న ప్రచారం అవాస్తవమని కేరళ పోలీసు విభాగం స్పష్టం చేసింది.

చదవండి : ‘పిల్లలు బీఫ్‌ తినడం పెద్దల తప్పు’

మరిన్ని వార్తలు