ఎయిమ్స్ వైద్యుల ఘ‌న‌త

25 May, 2020 14:00 IST|Sakshi

న్యూఢిల్లీ : న‌డుము భాగంలో అతుక్కొని పుట్టిన అవిభక్త క‌వ‌ల పిల్లల‌ను దాదాపు 24 గంట‌ల శస్త్రచికిత్స అనంత‌రం ఎయిమ్స్ వైద్యులు విజ‌య‌వంతంగా వేరుచేశారు. 64 మంది వైద్య సిబ్బంది పాల్గొన్న ఈ ఆప‌రేష‌న్‌లో పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్‌ బదౌన్‌ జిల్లాకు చెందిన ఈ కవల పిల్లలు దాదాపు రెండు నెల‌ల వ‌య‌సున్న‌ప్ప‌టి నుంచి వీరు ఎయిమ్స్ పీడియాట్రిక్స్ సర్జరీ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ మిను బాజ్‌పాయ్ నేతృత్వంలోని వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నారు. ప్ర‌స్తుతం ఈ చిన్నారుల వ‌య‌సు రెండు సంవ‌త్స‌రాలు. దీంతో శ‌స్త్రచికిత్స‌కు శ‌రీరం అనుకూలంగా ఉండ‌టంతో ఆప‌రేష‌న్‌ను ప్రారంభించారు. వైద్య‌రంగంలో ఇలాంటి కేసు చాలా అరుద‌ని  క‌వ‌లల దిగువ శ‌రీర భాగాలు అతుక్కొని ఉండ‌టమే కాక ఇద్ద‌రి గుండెలో రంధ్రం ఉండ‌టంతో స‌మ‌స్య మ‌రింత క‌ఠినం అయింద‌ని, అయిన్ప‌ప్ప‌టికీ  దాదాపు 24 గంట‌ల సుధీర్ఘ ఆప‌రేష‌న్‌తో ఇద్ద‌రిని విజ‌య‌వంతంగా వేరు చేసిన‌ట్లు ఆస్ప‌త్రి వ‌ర్గాలు వెల్ల‌డించాయి. (ఐదు రాష్ట్రాల్లో వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్)

"ఇద్ద‌రి శిశువుల‌ వెన్న‌ముక‌, ద‌గ్గ‌ర త‌గినంత చ‌ర్మం లేక‌పోవ‌డంతో గుండె, ప్ర‌ధాన ర‌క్త‌నాళాలకి స‌రిగ్గా రక్త ప్ర‌స‌ర‌ణ జ‌ర‌గ‌లేదు. దీంతో ఆప‌రేష‌న్ స‌మ‌యంలో చాలా స‌వాళ్ల‌ను ఎదుర్కొన్నాం. చాలా డీప్‌గా కేసు స్ట‌డీ చేశాక‌ ఈ కేసులో క్లిష్ట‌మైన అంశాలు ఎక్కువ‌గా ఉన్న‌ట్లు గుర్తించాం. దీంతో ఆప‌రేష‌న్ కోసం చాలా మంది ప్ర‌ముఖుల‌తో స‌మావేశం అయ్యి వారి   స‌ల‌హాలు, సూచ‌న‌లు తీసుకున్నాం "అని ఆప‌రేష‌న్‌లో పాల్గొన్న ఓ వైద్యుడు వెల్ల‌డించారు. అనస్థీషియాలజీ, ప్లాస్టిక్ సర్జరీ, సి.టి.వి.ఎస్. డిపార్ట్‌మెంట్ ఆఫ్ రేడియోడయాగ్నోసిస్, న్యూరోఫిజియాలజీ, న్యూక్లియర్ మెడిసిన్, బయోకెమిస్ట్రీ, నర్సింగ్, పారామెడికల్ సిబ్బంది ఓ జ‌ట్టులా ఏర్ప‌డి 24 గంట‌ల‌పాటు సుధీర్ఘంగా క‌ష్ట‌ప‌డి ఆప‌రేష‌న్‌ను విజ‌య‌వంతంగా పూర్తిచేసిన‌ట్లు తెలిపారు. క‌రోనా స‌మ‌యంలోనూ ఎయిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ రణదీప్ గులేరియా ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిస్థితిని స‌మీక్షించార‌ని, ఆప‌రేష‌న్‌ను విజ‌య‌వంతం కావ‌డం ప‌ట్ల క‌వ‌ల పిల్లల తల్లిదండ్రులు ఆనందం వ్య‌క్తం చేశారు. 
 (మాల్స్‌లో విదేశీ మ‌ద్యం అమ్మ‌కాల‌కు గ్రీన్ సిగ్న‌ల్)

మరిన్ని వార్తలు