కాల్ డ్రాప్ పై టెలికం కంపెనీలకు ఊరట

11 May, 2016 12:51 IST|Sakshi
కాల్ డ్రాప్ పై టెలికం కంపెనీలకు ఊరట

న్యూఢిల్లీ:  కాల్‌డ్రాప్ విషయంలో టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ కు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. వినియోగదారుడు  ఫోన్ మాట్లాడుతున్నప్పుడు మధ్యలో కట్ అయితే ఆ కాల్స్‌కు  నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. కాల్ డ్రాప్ పై టెలికం కంపెనీల నుంచి పరిహారం కోరే విధానాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. కోర్టు తీర్పుతో టెలికం కంపెనీలకు ఊరట లభించినట్లు అయింది.

కాగా వినియోగదారులు కాల్ చేసినప్పుడు, ఏ కారణం చేతనైనా ఆ కాల్ కట్ అయితే మొబైల్ ఆపరేటర్లు పరిహారం చెల్లించాలంటూ ట్రాయ్ గత అక్టోబర్‌లో టెలికం కన్సూమర్స్ ప్రొటెక్షన్  రెగ్యులేషన్స్‌కు సవరణ చేసింది. ఒక్కో వినియోగదారుడికి ఒక్కో కాల్‌డ్రాప్‌కు రూ. 1 చొప్పున, రోజుకు రూ.3 మించకుండా పరిహారం చెల్లించాలని నిబంధనలను ట్రాయ్ రూపొందించింది. ట్రాయ్ నిర్ణయాన్ని టెలికం కంపెనీలు సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. దీనిపై విచారించిన కోర్టు ట్రాయ్ నిర్ణయాన్ని కొట్టివేసింది.
 

మరిన్ని వార్తలు