కాంట్రాక్ట్‌ ఉద్యోగుల ఆత్మహత్యాయత్నం

28 May, 2018 11:45 IST|Sakshi

సాక్షి, చెన్నై: తమిళనాడులోని తూత్తుకుడిలో వేదాంత కంపెనీ స్టెరిలైట్‌ కాపర్‌ యూనిట్‌కు వ్యతిరేకంగా వరుసగా జరిగిన హింసాత్మక ఘటన మరువక ముందే రాష్ట్రంలో మరో విషాదం చోటుచేసుకుంది. కడలూర్ జిల్లాలోని నైవేలి లిగ్నైట్‌ కార్పొరేషన్‌లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను క్రమబద్ధీకరించాలనే డిమాండ్‌తో సోమవారం పలువురు ఆత్మహత్యకు యత్నించారు. పోలీసుల వివరాల ప్రకారం.. అధికారుల తీరుకు నిరసనగా 25 మంది కార్మికులు మూకుమ్మడిగా నీళ్లలో విషం కలుపుకొని తాగి ఆత్మహత్యాయత్నం చేశారని తెలిపారు. వెంటనే వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని, ప్రస్తుతం ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. కాంట్రాక్ట్‌ ఉద్యోగం నుంచి వారిని తొలగిస్తారనే భయంతోనే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. 

మరిన్ని వార్తలు