సినిమా ఫీటు.. తెచ్చింది చేటు!

12 May, 2020 11:15 IST|Sakshi

దామోహ్‌: సినిమాలో హీరోలు చేసే యాక్షన్‌ సీక్వెన్స్‌కు అభిమానులు విజిల్స్‌ వేస్తారు. అలాంటి విన్యాసాలు బయట చేస్తే చిక్కుల్లో పడతారు. మధ్యప్రదేశ్‌లో పోలీసు సబ్‌ఇన్‌స్పెక్టర్‌ ఒకరు ఇలాగే చిక్కుల్లో పడ్డారు.
దామోహ్‌ నగరంలో సబ్‌ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న మనోజ్‌ యాదవ్‌.. చేసిన విన్యాసం వైరల్‌గా మారడంతో ఆయనపై ఉన్నతాధికారులు సీరియస్‌ అయ్యారు. ‘సింగం’ సినిమా పాటలో హీరో అజయ్‌దేవగన్‌ చేసినట్టుగా రెండు కదులుతున్న కార్లపై రెండు కాళ్లు ఉంచి మనోజ్‌ యాదవ్ ఠీవిగా నిలబడి అభివాదం చేశారు. (పార్కింగ్‌ చేయడానికి సూపర్‌ ఐడియా..)

ఇదే ఫీట్‌ను 1991లో వచ్చిన ‘ఫూల్‌ ఔర్‌ కాంటే’ సినిమాలో అజయ్‌దేవగన్‌ తొలిసారిగా ప్రదర్శించారు. కదులుతున్న రెండు బైకులపై రెండు కాళ్లు పెట్టి కాలేజీకి వచ్చే సన్నివేశం అప్పట్లో ఆయనకు యువతలో క్రేజ్‌ తెచ్చిపెట్టింది. అయితే ఎస్‌ఐ మనోజ్‌ యాదవ్ చేసిన వీడియో సోషల్‌ మీడియా చక్కర్లు కొట్టి సీనియర్‌ అధికారులకు చేరడంతో ఆయనపై సాగర్‌ డివిజన్‌ ఐజీ అనిల్‌ శర్మ చర్య తీసుకున్నారు. అతడిని విధులను తొలగించి పోలీసు లైన్స్‌కు అటాచ్‌ చేశారు. అంతేకాదు ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లఘించినందుకు రూ. 5 వేలు జరిమానా విధించారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరపాలని ఐజీ ఆదేశించారు. (యూట్యూబ్ వ‌ర్సెస్ టిక్‌టాక్‌: గెలుపెవ‌రిది?)

మరిన్ని వార్తలు