లాక్‌డౌన్‌ ఉల్లంఘనులపై చర్యలు

9 Apr, 2020 14:37 IST|Sakshi

పట్నా : కరోనా మహమ్మారి కట్టడికి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలవుతున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించిన వారి నుంచి బిహార్‌ పోలీసులు రెండు వారాల్లో ఏకంగా రూ 2.67 కోట్ల జరిమానాను వసూలు చేశారు. లాక్‌డౌన్‌ ఉత్తర్వులను ఉల్లంఘించిన 500 మందికి పైగా వ్యక్తులను పోలీసులు అరెస్ట్‌  చేశారు. నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపైకి వచ్చిన 11,000కు పైగా వాహనాలను సీజ్‌ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 723 లాక్‌డౌన్‌ ఉల్లంఘనలను నమోదు చేసినట్టు బిహార్‌ పోలీసులు వెల్లడించారు. బక్సర్‌, గయా, సుపౌల్‌, భాగల్పూర్‌ జిల్లాల్లో లాక్‌డౌన్‌ ఉల్లంఘనులను గుర్తించేందుకు పోలీసులు డ్రోన్లు ఉపయోగించారు.

జనసమ్మర్ధ ప్రాంతాల్లో ఉల్లంఘనులను స్పాట్‌లో గుర్తించేందుకు తాము డ్రోన్లను ఉపయోగించామని, లాక్‌డౌన్‌ సమయంలో ఇళ్ల వందే ఉండాలని వారిని హెచ్చరించి వదిలివేశామని సరన్‌ ఎస్పీ ఆశిష్‌ భారతి తెలిపారు. ప్రజలు సామాజిక దూరం పాటించి లాక్‌డౌన్‌ను కఠినంగా అమలుచేయడంలో డ్రోన్లు తమకు సహకరించాయని చెప్పారు. లాక్‌డౌన్‌ నియమాలను ఉల్లంఘించిన ప్రజలను కట్టడి చేసేందుకు బిహార్‌ రాజధాని పట్నాలో పలు ప్రాంతాల్లో పోలీసులు లాఠీలకు పనిచెప్పాల్సి వచ్చింది.

చదవండి : లాక్‌డౌన్‌: భార్య ఎడ‌బాటు త‌ట్టుకోలేక‌..

మరిన్ని వార్తలు