పోలీసుల చొరవతో తీరిన బాలుడి ఆశ

15 Aug, 2015 16:31 IST|Sakshi

ముంబై:  69 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా  ముంబై పోలీసులు పదకొండేళ్ల బాలుడి ఆకాంక్షను నెరవేర్చారు.   వీరి చొరవతో ఈ బాలుడు పోలీస్ అవ్వాలనే  తన కలను సాకారం చేసుకున్నాడు.

నవీ ముంబైకి చెందిన జీత్ భానుశాలి కి పోలీసు అవ్వాలనే కోరిక ఉండేది. అయితే ఇక్కడ విషాదమేంటంటే భాను గత కొంతకాలంగా ప్రాణాంతకమైన హిమోఫిలియా వ్యాధితో బాధపడుతున్నాడు.  ఇక ఎంతో కాలం బతకడని వైద్యులు చెప్పారు.  దీంతో బాలుడి తల్లిదండ్రులు 'మేక్స్ ఎ విష్ ఫౌండేషన్'  ను సంప్రదించారు.  ఈ స్వచ్ఛంద సంస్థ ద్వారా విషయం తెలుసుకున్న  ముంబై పోలీసులు అతని ఆకాంక్షను నెరవేర్చేందుకు అంగీకరించారు. నవీ ముంబాయి అసిస్టెంట్ కమిషనర్ అరుణ్ వాల్తేర్, వాషి పోలీస్ స్టేషన్ అధికారి అజయ్ కుమార్ దీనికి సంబంధించిన ఏర్పాటు చేశారు.  పోలీసు అధికారిగా జీత్ ను గౌరవించారు. స్టేషన్ ఇంచార్జ్  దుస్తుల్లో  ఉన్న జీత్కు సీనియర్ పోలీసులు స్టేషన్ పరిసరాలను  చూపించారు. అతనిచే మువ్వన్నెల పతాకాన్ని ఎగురవేయించారు. జీత్ తనకిష్టమైన  పోలీస్ యూనిఫాంలో మురిసిపోయాడు.  జెండాను ఆవిష్కరిస్తున్నఆ బాలుడి కళ్ళల్లో వెలుగు చూసిన పలువురి కళ్లు ద్రవించాయి.

మేక్స్ ఏ విష్ ఫౌండేషన్ తన కుమారుడి కోరికను తీర్చడం ఎంతో ఆనందంగా ఉందని బాలుడి తల్లి పేర్కొన్నారు. చాలా రోజుల తర్వాత తన కుమారుడి కళ్లలో ఆనందం చూశానన్నారు. తన  బిడ్డ కళ్లల్లో ఎనలేని ఆనందాన్ని నింపిన పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు.
 

మరిన్ని వార్తలు