దేశంలో 24 గంటల్లో 9,304 కేసులు

4 Jun, 2020 10:30 IST|Sakshi

న్యూఢిల్లీ : భారత్‌లో గత కొద్దీ రోజులుగా కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. రోజురోజుకీ కేసుల సంఖ్య అధికమవడంతో ఆందోళన మరింత తీవ్రమవుతోంది. గడిచిన 24 గంటల్లో 9,304 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కాగా భారత్‌లో ఒక్క రోజులో ఇంత భారీ మొత్తంలో కేసులు నమోదవ్వడం ఇదే తొలిసారి. దేశంలో ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 2,16,919కు చేరుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. వైరస్‌ కారణంగా నిన్న ఒక్కరోజే 260 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒకే రోజు ఈ స్థాయిలో మరణించడం కూడా ఇదే తొలిసారి. దీంతో మొత్తం మరణాల సంఖ్య 6,075కు చేరింది.

అయితే కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి అవుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతుండటం కొంత ఊరటనిస్తోంది. ఇప్పటి వరకు 1,04,107 మంది కోలుకోగా  1,06,737 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇక అత్యధిక కోవిడ్‌ కేసులు ఉన్న దేశాల్లో భారత్‌ 7వ స్థానంలో ఉంది. మరణాల్లో 13వ స్థానంలో ఉన్న భారత్‌ తాజాగా 12 స్థానానికి ఎగబాకింది. (‘వారు 7 రోజులు క్వారంటైన్‌లో ఉండాల్సిందే)

మరిన్ని వార్తలు