తబ్లిగి జమాత్‌ : ఈశాన్యానికి విషపు వైరస్‌

2 Apr, 2020 11:05 IST|Sakshi

డిస్‌పూర్‌ : ఈశాన్య రాష్ట్రాల్లో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల పెరుగుదల తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మొన్నటి వరకు ప్రశాంతంగా హిమాలయ రాష్ట్రాల్లో ఒక్కసారిగా పెద్ద ఎత్తున కరోనా కేసులు పెరిగాయి. అస్సాంలో బుధవారం వరకు కేవలం ఒక్క కరోనా కేసు మాత్రమే ఉండగా.. తాజాగా ఆ సంఖ్య 16కి చేరింది. మరోవైపు అరుణాచల్‌ ప్రదేశ్‌లోనూ తొలి పాజిటివ్‌ కేసు నమోదు అయ్యింది. కాగా వీరంతా ఢిల్లీలో జరిగిన తబ్లిగి జమాత్‌కు హాజరై తిరిగి వచ్చిన వారే కావడం గమనార్హం. దీంతో నిజాముద్దీన్‌లోని మర్కజ్‌ ప్రకంపనలు ఈశాన్య భారతాన్నీ తాకాయి.

ఒక్క అస్సాం నుంచే మర్కజ్‌కు 547కు మంది హాజరైట్లు ఆ రాష్ట్ర అధికారులు తెలిపారు. వీరిలో చాలామందిని గుర్తించి నిర్బంధం కేంద్రానికి తరలించామని, ఇంకా 117 మంది ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. 196 మంది నమూనాలను పరీక్షా కేంద్రాలకు పంపినట్లు అధికారులు తెలిపారు. కాగా ఇప్పటికే మణిపూర్‌, మిజోరంలో ఒక్కో కరోనా పాజిటివ్‌ కేసులు వెలుగుచూసిన విషయం తెలిసిదే. అయితే ఢిల్లీ మర్కజ్‌కు వెళ్లిన వారికి కరోనా సోకడంతో ఆయా ప్రభుత్వాలు అలెర్ట్‌ అ‍య్యాయి. మరోవైపు ఇప్పటి వరకు ఈశాన్య ప్రాంతంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 20కి చేరింది. (‘ఆపరేషన్‌ మర్కజ్‌’)

కాగా ఢిల్లీలో జరిగిన తబ్లిగి జమాత్‌కు హాజరై కరోనాతో తిరిగి స్వస్థలాలకు వెళ్లిన వారి వల్ల దేశంలో ఒక్కసారిగా కేసుల సంఖ్య పెరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మహారాష్ట్రలో 335, కేరళ 280 కేసులు నమోదయ్యాయి. ఇక తమిళనాడులో మొత్తం కేసుల సంఖ్య 234కి చేరింది. వీటిలో 110 కేసులు ఢిల్లీలోని తబ్లిగి జమాత్‌కు హాజరైనవారికి సంబంధించినవే కావడం గమనార్హం. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ తబ్లిక్‌ తీవ్ర ప్రభావం చూపిన విషయం తెలిసిందే. మర్జజ్‌కు వెళ్లివచ్చిన వారితో పాజిటివ్‌ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. దీంతో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు మరింత అప్రమత్తం అయ్యాయి.

మరిన్ని వార్తలు