కరోనాపై ఆనాడే స్పందించి ఉంటే..

24 Apr, 2020 12:47 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ‘భారత్‌కు పటిష్టమైన ఆరోగ్య నిఘా వ్యవస్థ ఉంది. అది కరోనా వైరస్‌ను దేశ సరిహద్దు లోపలికి రానీయదు’ అని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్ష వర్ధన్‌ ఫిబ్రవరి 22వ తేదీనా వ్యాఖ్యానించారు. జనవది 30వ తేదీనే దేశంలో తొలి కరోనా కేసు నమోదయిన విషయం తెలిసిందే. ఆరోగ్య అత్యయిక పరిస్థితి (హెల్త్‌ ఎమర్జెన్సీ)ని ప్రకటించాల్సిన అవసరం లేదని చెప్పిన ఆయనే మార్చి 13వ తేదీన మరో ప్రకటన చేశారు. దేశంలో ఆరోగ్య అత్యయిక పరిస్థితిని ప్రకటించాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేస్తూ యూపీఏ–1 ప్రభుత్వం ‘పబ్లిక్‌ హెల్త్‌ ఎమర్జెన్సీ బిల్లు’ను తీసుకొచ్చిన విషయాన్ని గుర్తు చేసింది. (వావ్‌.. క్వారంటైన్‌ ఫ్యాషన్‌ వీక్‌ చూశారా?)

మరి ఇప్పుడేమైందీ? కరోనా వైరస్‌ యావత్‌ దేశాన్ని భయబ్రాంతులకు గురిచేయడం లేదా ? హెల్త్‌ ఎమర్జెన్సీ కింద దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను అమలు చేయడం లేదా ? కేంద్ర ఆరోగ్య శాఖ అప్పుడే స్పందించి ఉంటే నేడు దేశంలో వ్యక్తిగత రక్షణ పరికరాలు (పీపీఈ)గా పేర్కొనే మాస్క్‌లు, గ్లౌజులు, సేఫ్టీ గ్లాసెస్, కవరాల్‌ సూట్ల కొరత వచ్చేది కాదు కదా!  వీటి కొరత కారణఃగా వైద్య సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని ‘యునైటెడ్‌ రెసిడెంట్‌ అండ్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ ఇండియా’ కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాల్సిన అవసరం వచ్చేదే కాదు. పీపీఈల తయారీకి టెండర్లను ఖరారు చేయడంలో కూడా ఎంతో ఆలస్యం జరిగిందని రెండు అతిపెద్ద పీపీఈ ఉత్పత్తి కంపెనీల సంఘాలు ఆరోపించడం కూడా ఇక్కడ గమనార్హం. (ఈ చిత్రంలో ఎన్ని పులులు ఉన్నాయి? )

‘అవును, పీపీఈలు చాలినన్ని లేవు. కొరత ఎక్కువగానే ఉంది’ అన్న విషయాన్ని మార్చి 18వ తేదీన జరిగిన సమావేశంలో కేంద్ర జౌళీ శాఖ అంగీకరించినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పీపీఈలను ఉత్పత్తిచేసే అనేక కంపెనీలు ‘లాక్‌డౌన్‌’ కారణంగా మూతపడ్డాయి. దేశంలో వైద్యరంగానికి జీడీపీలో కొంత శాతాన్ని కేటాయిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ జనవరి నెలలోనే ప్రకటించారు. అది జరిగి ఉన్నా దేశంలోని వైద్య రంగం కొంత బలపడి ఉండేది. (కరోనా మనకు కొత్త పాఠాలు నేర్పింది: మోదీ )


 

>
మరిన్ని వార్తలు