స్మార్ట్‌ఫోన్‌తో కరోనాను గుర్తించవచ్చు!

20 Jun, 2020 14:17 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహామ్మరి (కోవిడ్‌–19) సోకిందా లేదా నిర్ధారించేందుకు ఇప్పటికే పలు కిట్లు అందుబాటులోకి వచ్చాయి. ఇంకా వస్తున్నాయి కూడా. ఎంత తక్కువ సమయంలో గుర్తిస్తుంది, ఎంత తక్కువ డబ్బుకు వస్తుందనే అంశాల ప్రాతిపదికనే ఈ కిట్ల అమ్మకాలు ఆధారపడి ఉన్నాయి. అన్నింటికన్నా ముఖ్యం సెల్‌ఫోన్‌ ద్వారా కరోనాను గుర్తించడంపై ప్రపంచ దేశాలు తమ దృష్టిని కేంద్రీకరించాయి. ప్రస్తుతం ఈ విషయంలో కూడా చైనానే ముందుందన్న వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే పలు వైరస్‌లు, బ్యాక్టీరియాలు, టాక్సిన్ల స్మార్ట్‌ ఫోన్ల ద్వారా గుర్తించే పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. చదవండి: సరిహద్దులో కరోనా టెస్టింగ్‌ యూనిట్

హెచ్‌ఐవీ, మలేరియా, టీబీలతోపాటు ఆహార పదార్థాల విషతుల్యాన్ని స్మార్ట్‌ స్మోన్ల ద్వారా గుర్తించవచ్చు. ఎవరికైనా, ఏదైనా జబ్బుందా లేదా అన్న అంశాన్ని నిర్ధారించకునేందుకు గొంత నుంచి శ్లేష్మం లేదా రక్తం శాంపిళ్లు తీసుకొని వాటిని ల్యాబ్‌లలో పరీక్షించి విశ్లేషిస్తాం. అదే రోగాన్ని స్మార్‌ ఫోన్‌ ద్వారా గుర్తించాలంటే లైట్, కలర్, ఎలక్ట్రో కెమికల్‌పై ఆధారపడక తప్పదు. రోగాలనుబట్టి వీటి స్పందన ఆధార పడి ఉంటుంది. సెల్‌ఫోన్‌లోని కెమేరా, లైట్‌ సెన్సార్లు లైట్, కలర్, ఎలక్ట్రో కెమికల్‌ను గుర్తిస్తాయి. తద్వారా రోగికున్న రోగాన్ని నిర్ధారించి సంబంధిత వైద్యులకు సమచారాన్ని చేరవేస్తాయి. డేటాను విశ్లేషించడానికి ‘యాప్‌’లు ఉన్నాయి.
 
ఉదాహరణకు హెచ్‌ఐవీ, సిఫిలీస్‌ లాంటి సుఖ రోగాలను కనుగొనేందుకు ‘మైచిప్‌ డోంగ్లే’ అనే యాప్‌ 2015లోనే అందుబాటులోకి వచ్చింది. అయితే ఇంటి వద్ద నుంచి దీన్ని పరీక్షించుకునే ట్రయల్స్‌ మాత్రం గత ఏప్రిల్‌ నెలలోనే ముగిశాయి. కోవిడ్‌–19కు ఇప్పట్లో వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చే అవకాశం లేదు కనుక సెల్‌ఫోన్‌ ద్వారా గుర్తించడం అందుబాటులోకి వస్తే దాని వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ఎక్కడెక్కడ హాట్‌ స్పాట్స్‌ ఉన్నాయో, ఏ ప్రాంతాలకు వెళ్లకూడదో ముందుగానే గ్రహించవచ్చు. ఏకాంతానికి లేదా సామాజిక దూరం పాటించేందుకు ఏ ప్రాంతాలు అనువైనవో కూడా ముందుగానే  గ్రహించవచ్చు. చదవండి: క‌రోనా: ఇక‌పై 5 రోజుల‌పాటు ఆస్పత్రిలోనే
 

మరిన్ని వార్తలు